ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు: ఈ నెల 25 జడ్పీ ఛైర్మెన్ ఎన్నికకు నోటిఫికేషన్

Published : Sep 19, 2021, 02:18 PM IST
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు: ఈ నెల 25 జడ్పీ ఛైర్మెన్ ఎన్నికకు నోటిఫికేషన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా పరిషత్ ,మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నెల 24న ఎంపీపీ, ఈ నెల 25న జడ్పీ ఛైర్మెన్ల ఎన్నికలను నిర్వహించనున్నారు.  

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా పరిషత్, ఎంపీపీల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది.  ఏపీ హైకోర్టు ధర్మాసనం  ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్రంలోని పలు కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలోని మెజారిటీ స్థానాల్లో వైసీపీ ప్రభంజనం కన్పించింది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో వైసీపీ అభ్యర్ధులు దూసుకెళ్లారు.

జిల్లా పరిషత్ ఛైర్మెన్ల, ఎంపీపీల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 24న ఎంపీపీలు, ఈ నెల 25న జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎంపికను నిర్వహించనున్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.ఏప్రిల్ 1వ తేదీన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఏపీ హైకోర్టు ధర్మాసనం  ఏపీ ఎన్నికల ఫలితాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇవాళ  కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఒకేసారి 5 అల్పపీడనాల అటాక్.. ఈ ప్రాంతాల్లో తుపానులు, భారీ వర్షాలతో అల్లకల్లోలమే..!
ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదు..మహిళా రిజర్వేషన్ బిల్లు పై Chandrababu Reaction | Asianet News Telugu