ఖైనీ కోసం ఆశపడితే.. జీవితమే ఖతమయ్యింది.. !

By AN TeluguFirst Published Feb 16, 2021, 3:00 PM IST
Highlights

శ్రీ కాళహస్తిలో దారుణం జరిగింది. గుట్కా పాకెట్ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. దెబ్బతిన్న గోడల మధ్య ఖైనీ ప్యాకెట్ పడిపోయింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి దాన్ని ఎలాగైనా తీసుకోవచ్చనుకుని అందులో దూరాడు. బైటికి రాలేక, ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. 

శ్రీ కాళహస్తిలో దారుణం జరిగింది. గుట్కా పాకెట్ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. దెబ్బతిన్న గోడల మధ్య ఖైనీ ప్యాకెట్ పడిపోయింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి దాన్ని ఎలాగైనా తీసుకోవచ్చనుకుని అందులో దూరాడు. బైటికి రాలేక, ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. 

ఈ సంఘటన సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలో వెలుగుచూసింది. వన్‌టౌన్‌ ఎస్‌ఐ సంజీవ్ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏర్పాడు మండలం బండారుపల్లెకు చెందిన దేశయ్య(48) చేపల వ్యాపారం చేస్తాడు. 

ఆదివారం ఉదయం చేపలు అమ్మడానికి శ్రీకాళహస్తికి వచ్చాడు. ఉదయమంతా చేపలు అమ్మాడు. అనంతరం రాత్రికి మద్యం తాగేందుకు పట్టణ పరిధిలోని పానగల్ వద్ద ఊరందూరు మార్గంలో ఉన్న ఓ దుకాణ సముదాయం వెనకకు వెళ్లాడు. 

అక్కడ మద్యం తాగి స్వగ్రామానికి బయల్దేరాడు. ఆ టైంలో ఓ పాడుబడిన రైస్‌మిల్‌ గదుల దగ్గర ఆగాడు. అక్కడ తన దగ్గరున్న ఖైనీ వేసుకుందామని ప్రయత్నించాడు. తాగి ఉండడంతో పట్టుతప్పి ఖైనీ ప్యాకెట్ దెబ్బతిన్న గది గోడల్లోనుంచి లోపలికి పడింది. అక్కడే కదా ఉంది. వంగితే అందుతుందిలే అనుకున్నాడు. 

దీంతో దేశయ్య గోడల మధ్య నుంచి లోపలికి దూరి ఖైనీ అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉండడంతో అందులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక మృతిచెందాడు. 

ఈ విషయం సోమవారం ఉదయం స్థానికులు గుర్తించే వరకు తెలియలేదు. వెంటనే వారు వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సంజీవ్ కుమార్ చేపల వ్యాపారి మృతదేహాన్ని బైటికి తీయించి, శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

click me!