సన్న బియ్యం సన్నాసిగాడు: బోస్టన్ కమిటీపై కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు

Published : Jan 04, 2020, 11:40 AM IST
సన్న బియ్యం సన్నాసిగాడు: బోస్టన్ కమిటీపై కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు

సారాంశం

మూడు రాజధానులపై బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ ఆ నివేదిక సన్నబియ్యం సన్నాసిగాడు ఇచ్చినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

అమరావతి: బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని బోస్టన్ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. తన నివేదికను బోస్టన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అందజేశారు. 

బోస్టన్ కన్సల్టెన్సీ కంపెనీ ఇచ్చిన నివేదికను హేళన చేస్తూ కేశినేని నాని ట్వీట్టర్ లో వ్యాఖ్యలు చేశారు అది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదిక మాదిరిగా లేదని, సన్నబియ్యం సన్యాసిగాడు ఇచ్చిన నివేదిక మాదిరిగా ఉందని ఆయన అన్నారు. 

"ఇది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన రిపోర్టులాగా లేదుజగన్ మోహన్ రెడ్డి గారూ... సన్నబియ్యం సన్యాసిగాడు ఇచ్చిన రిపోర్టులాగా ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు. 

పోలీసులను ఉపయోగించి ఉద్యమాలను ఆపలేరని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య అన్నారు. మందడంలో మహిళా రైతులపై ప్రభుత్వం పాశవిక దాడి అమానుషమని ఆయన అన్నారు. ఉద్యమకారులను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా అమరావతి తరలింపును ఆపాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu
Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు | Asianet News Telugu