శ్రీకాకుళంలో ఘోర ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి

Published : Jan 04, 2020, 09:38 AM IST
శ్రీకాకుళంలో ఘోర ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి

సారాంశం

మృతులను ఒడిసా వాసులుగా గుర్తించారు. కారు విశాఖపట్నం నుంచి బరంపూర్ వైపు వెళుతోంది. సింహాచలం ఆలయానికి వెళ్లి... తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు


శ్రీకాకుళం జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మందస మండలం కొత్తపల్లి వద్ద ఉన్న వంతెన పై నుంచి ఓ కారు కిందకు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. 

మృతులను ఒడిసా వాసులుగా గుర్తించారు. కారు విశాఖపట్నం నుంచి బరంపూర్ వైపు వెళుతోంది. సింహాచలం ఆలయానికి వెళ్లి... తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి  చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి... పోస్టు మార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు  పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?