టీడీపీలో అసంతృప్తిగా లేను.. నేను ఎంపీగా ఉన్నా లేకపోయినా విజయవాడకు నష్టమేమి లేదు: కేశినేని నాని

By Sumanth KanukulaFirst Published Aug 15, 2022, 1:40 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తూనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వార్తలపై కేశినేని నాని స్పందించారు. 

తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తూనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వార్తలపై కేశినేని నాని స్పందించారు. తాను టీడీపీలో అసంతృప్తిగా లేనని చెప్పారు. మీడియా తన మీద ఫోకస్ చేయొద్దని కోరారు. తాను ఎంపీగా ఉన్నా లేకపోయిన విజయవాడకు నష్టమేమి లేదన్నారు. తనలాంటి నానిలు లక్షమంది పుట్టకొస్తారని అన్నారు. తన కార్లపై ఎక్కడైనా ఎంపీ స్టిక్కర్ కనిపించిందా అని ప్రశ్నించారు. తన ఒకే ఒక్క కారుకు ఎంపీ స్టిక్కర్ ఉంటుందని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై కేశినేని నాని అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తన సోదురుడు కేశినేని శివనాథ్‌ను (చిన్ని) చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడనే అసంతృప్తిలో కేశినాని నాని ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విజయవాడ ఎంపీ కేశినేని నాని అసహనంగా కనిపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ చేరుకోగానే.. ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. చంద్రబాబుకు ఎంపీలు సన్మానం చేసి, పుష్పగుచ్చం ఇచ్చారు. 

అయితే చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా మరో ఎంపీ గల్లా జయదేవ్.. కేశినేని నానిని కోరారు. అయితే నాని మాత్రమే మీరే ఇవ్వండనేలా.. పుష్పగుచ్చాన్ని తోసేశారు. దీంతో అక్కడున్న వారంతా కొద్దిగా షాక్ అయ్యారు. అయితే ఆ తర్వాత మాత్రం నాని.. చంద్రబాబుతో కలిసి పర్యటనలో కనిపించారు.

click me!