శ్రీకాకుళం జిల్లాలో దారుణం: ఆస్తి కోసం కోసం అన్న, అక్కను చంపిన తమ్ముడు

Published : Mar 07, 2021, 12:22 PM IST
శ్రీకాకుళం జిల్లాలో దారుణం: ఆస్తి కోసం కోసం అన్న, అక్కను చంపిన తమ్ముడు

సారాంశం

జిల్లాలోని రణస్థలం మండలం రామచంద్రాపురంలో ఆస్తి గొడవలతో అన్న, అక్కను తమ్ముడు అత్యంత దారుణంగా హత్య చేశాడు.

శ్రీకాకుళం: జిల్లాలోని రణస్థలం మండలం రామచంద్రాపురంలో ఆస్తి గొడవలతో అన్న, అక్కను తమ్ముడు అత్యంత దారుణంగా హత్య చేశాడు.

రామచంద్రాపురం గ్రామానికి చెందిన సన్యాసిరావు ఆదివారం  నాడు ఉదయం పశువుల పాకలో పాలు పితుకుతుండా వెనుక నుండి వచ్చిన తమ్ముడు రామకృష్ణ కత్తితో నరికాడు.

దీంతో ఆయన అక్కడికక్కడే కిందపడిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న సోదరి జయమ్మ  ఇది చూసి అక్కడికి పరుగున వచ్చింది. అయితే  అక్కడికి వచ్చిన జయమ్మ ను కూడ అతను నరికాడు. దీంతో ఆమె కూడ అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది.

ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. నిందితుడు పారిపోయినట్టుగా పోలీసులు చెప్పారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం