ప్రత్యేక హోదాపై జగన్ హామీలన్నీ ఉత్తరకుమార ప్రగల్బాలే..: దేవినేని, కేశినేని ఫైర్

By Arun Kumar PFirst Published May 29, 2020, 11:50 AM IST
Highlights

ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి జగన్, వైసిపి ప్రభుత్వం మాటతప్పారని... కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని అధికారంలోకి రాగానే మడమ తిప్పారని మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎంపీ కేశినేని నాని విమర్శించారు. 

విజయవాడ: ఎన్నికల సమయంలో రాష్ట్రానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను వైసిపి ప్రభుత్వం విస్మరించిందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా విషయంలో  ముఖ్యమంత్రి జగన్, వైసిపి ప్రభుత్వం మాటతప్పారని... కేంద్రం మెడలు వచి హోదా సాధిస్తామని అధికారంలోకి రాగానే మడమ తిప్పారని విమర్శిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమ, టిడిపి ఎంపీ కేశినేని నానిలు ఇదే విషయంపై జగన్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికన నిలదీశారు. 

''ఎన్నికలముందు మాకు 25ఎంపీలనిస్తే కేంద్రంమెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తామన్నారు 22మంది ఎంపిలనిస్తే మొదటి నెలలోనే అడుగుతూ..ఉంటాం అంటూ మాటమార్చారు. 12నెలలకు హోదా ఇప్పట్లోలేదంటూ మడమతిప్పిన మీనైజాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలకు సమాధానం చెప్పే దైర్యంఉందా ఒక్కఛాన్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు'' అంటూ సీఎంకు దేవినేని ఉమ సవాల్ విసిరారు. 

read more   జగన్ కు హైకోర్టు షాక్: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డనే, ఆర్టినెన్స్ రద్దు

''మీపాలన..మాప్రశ్నలు... ప్రభుత్వం వచ్చిన 6నెలల్లోనే లక్షా80వేలకోట్ల పెట్టుబడులు వెనక్కిపోయాయి. పిపిఏల రద్దుతో దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు. సింగపూర్ కన్సోర్టియం, లులు, అదాని, కియా అనుబంధ, కాగితపరిశ్రమలు, ఐటీకంపెనీలు ఎందుకువెళ్లిపోయాయో ప్రజలకు చెప్పండి వైఎస్ జగన్ గారు'' అంటూ నిలదీశారు. 

''నాకు ఓట్లు వేయండి ఆధికారంలోకి వస్తే చించేస్తా పొడిచేస్తా మాట తప్పకుండా మడమ తిప్పకుండా వెన్ను చూపకుండా కేంద్రం మెడలు వంచి ప్రత్యక హోదా తెస్తానని ప్రగల్బాలు పలకావు ఇప్పుడేమో చేతులెత్తేశావేంటి ఉత్తరకుమారా వైఎస్ జగన్'' అంటూ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. 

''వేల కోట్ల రూపాయలు ప్రజా ధనం దోచుకొని 16 నెలలు జైలులో ఉన్నావు కదా ఒక్క సారైనా పశ్చాత్తాపానికి గురి అయ్యావా?'' అంటూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి ఘాటు విమర్శలు చేసిన వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డికి అంతే ఘాటుగా సమాధానమిచ్చారు కేశినేని నాని. 

 

click me!