తండ్రి కేశినేని నాని బాటలోనే కూతురు శ్వేత ... టిడిపికి రాజీనామా 

By Arun Kumar PFirst Published Jan 8, 2024, 10:11 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నానితో పాటు ఆయన కూతురు శ్వేత కూడా తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు.  ఆమె కార్పోరేటర్ పదవితో పాటు టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు నాని ప్రకటించారు. 

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ విజయవాడ టిడిపిలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. కేశినేని బ్రదర్స్ మధ్య ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా వున్న విబేధాలు ఎన్నికల వేళ ఆధిపత్య పోరుగా మారాయి. ఈ క్రమంలో టిడిపి నాయకత్వం సోదరుడు కేశినేని చిన్ని పక్షాన నిలవడంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా  టిడిపి కార్పోరేటర్ కేశినేని శ్వేత కూడా తండ్రి బాటలోనే నడిచారు. కార్పోరేటర్ పదవితో పాటు టిడిపికి కూతురు శ్వేత రాజీనామా చేయనున్నట్లు నాని ప్రకటించారు.  

ఇవాళ (సోమవారం) ఉదయం శ్వేత విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయానికి వెళ్ళి కార్పోరేటర్ పదవికి రాజీనామా చేస్తుందని కేశినేని నాని తెలిపారు. ఆమె రాజీనామాను ఆమోదించిన మరుక్షణమే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుందని నాని వెల్లడించారు.  ప్రస్తుతం శ్వేత విజయవాడ 11వ డివిజన్ కార్పోరేటర్ గా కొనసాగుతున్నారు. 

Latest Videos

ఇక ఇప్పటికే ఎంపీ పదవికి, టిడిపికి రాజీనామా చేయనున్నట్లు కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి తన అవసరం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భావించారు... అయినా ఆ పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని భావిస్తున్నానని నాని అన్నారు. కాబట్టి మొదట డిల్లీకి వెళ్లి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ కు అందజేసిన మరుక్షణమే టిడిపికి కూడా రాజీనామా చేస్తానని కేశినేని నాని ప్రకటించారు. అంతకు ముందే తన కూతురితో రాజీనామా చేయిస్తున్నారు నాని. 

Also Read  టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ !?

గత మున్సిపల్ ఎన్నికల్లో కూతురు శ్వేతను బరిలోకి దింపి మేయర్ చేయాలని నాని భావించారు. అయితే శ్వేతను ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని నాని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును కోరారు. కానీ టిడిపిలోనే మరో వర్గం శ్వేతను మేయర్ అభ్యర్థిగా వ్యతిరేకించారు. టిడిపి అధిష్టానం కూడా తనకు వ్యతిరేక వర్గంవైపే వుందని భావించిన నాని విమర్శలు మొదలుపెట్టాడు. ఇలా టిడిపి వ్యతిరేక వ్యాఖ్యలే కాదు వైసిపి ఎమ్మెల్యేలు, నాయకులతో నాని సన్నిహితంగా వుండటం ప్రారంభించాడు. దీంతో ఆయన టిడిపిని వీడతాడని ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది.  

ఇక టిడిపిలో తనకంటే సోదరుడు కేశినేని చిన్నికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నాని ఏమాత్రం సహించలేకపోయాడు. తాజాగా చంద్రబాబు 'రా... కదలిరా' సభ ఇంచార్జీ బాధ్యతలు కూడా చిన్నికి అప్పగించింది టిడిపి. అలాగే ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ మరొకరికి ఇవ్వనున్నట్లు నానికి సమాచారం ఇచ్చారు. దీంతో టిడిపికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు కేశినేని నాని. 

click me!