విజయవాడ ఎంపీ కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని సోమవారం నాడు వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. ఇటీవలనే కేశినేని చిన్నిపై సోదరుడు నాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తరుణంలో వంగవీటి రాధాతో చిన్ని భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
విజయవాడ: విజయవాడ ఎంపీ kesineni N ani సోదరుడు కేశినేని Chinni సోమవారం నాడు మాజీ ఎమ్మెల్యే Vangaveeti Radha తో భేటీ అయ్యారు.ఈ భేటీ TDP వర్గాల్లో చర్చకు దారి తీసింది. సోదరుడు నానితో చిన్నికి విబేధాలు ఇటీవలనే బట్టబయలయ్యాయి.విజయవాడలోని టీడీపీలో చోటు చేసుకొన్న పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టుగా సమాచారం. సోదరుడు నానితో చిన్ని విబేధిస్తున్నారు.దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకొంది.
విజయవాడ ఎంపీ కేశినేని నానికి చెందిన ఎంపీ స్టిక్కర్ ను చిన్ని ఉపయోగించడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.విజయవాడ, హైద్రాబాద్ నగరాల్లో టీఎస్ 07హెచ్ 7777 అనే నెంబర్ వాహనం తన ఎంపీ స్టిక్కర్ ను అక్రమంగా వినియోగిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ నిర్వహించి వాహనాన్ని తిరిగి ఇచ్చినట్టుగా కేశినేని చిన్ని గత నెల 21న ప్రకటించారు.ఈ విషయమై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ విషయమై ఈ ఏడాది మే 27న ఫిర్యాదు చేశారు.
undefined
also read:చంద్రబాబు ఏది చెబితే అది చేయడానికి రెడీ.. నానితో ఎక్కడ విబేధించలేదు: కేశినేని నాని సోదరుడు చిన్ని
జూన్ 9వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మి పేరున ఈ వాహనం రిజిస్టరై ఉంది. ఈ విషయమై పోలీసులు అన్ని విసయాలు విచారించి తన వాహనాన్ని తనకు తిరిగి ఇచ్చారని కేశినేని చిన్ని ప్రకటించారు. తన సోదరుడితో ఎలాంటి విబేధాలు లేవని చిన్ని ప్రకటించారు. టీడీపీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్నట్టుగా చిన్ని వివరించారు. తమ మధ్య ఆస్తి విబేధాలు కూడా లేవన్నారు. అదే సమయంలో చంద్రబాబు ఆదేశాలను సామాన్య కార్యకర్తగా పాటిస్తానని కూడా చిన్ని ప్రకటించారు. స్టిక్కర్ విషయమై తనను అడిగితే తాను సమాధానం చెప్పేవాడినన్నారు