ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ రైతుపేటలో హరితవర్షిణి ఆత్మహత్య చేసుకొంది. ఈ విషయమై లోన్ రికవరీ ఏజంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ: Credit Card రికవరీ ఏజంట్ల వేధింపులతో ఇంటర్ విద్యార్ధిని హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్టుగా Vijayawada డీసీపీ మేరీ ప్రశాంతి చెప్పారు. క్రెడిట్ కార్డు లోన్ రికవరీ ఏజంట్ల వేధింపులతో మనోవేదనకు గురైన విద్యార్ధిని Haritha Varshini ఇటీవలనే Suicide చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ విషయమై Vijayawada పోలీసులు సోమవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఎస్ఎల్‌వీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏజెన్సీకి చెందిన ఏడుగురు సభ్యులను అరెస్ట్ చేసినట్టుగా డీసీపీ చెప్పారు.ఈ కేసులో ఈ సంస్థకు చెందిన ముగ్గురు మేనేజర్లు, నలుగురు రికవరీ ఏజంట్లను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.రికవరీ ఏజంట్లు ఎవరైనా వేధింపులకు పాల్పడితే చట్టసరమైన చర్యలు తీసుకొంటామని పోలీసులు ప్రకటించారు.
undefined
ఈ కేసులో ప్రధాన సూత్రధారులు పనవ్ కుమార్, భాగ్యతేజ అలియాస్ సాయి లు విద్యార్ధిని హరిత వర్షిణిని అవమానించారని ఒప్పుకున్నారని డీసీపీ తెలిపారు. విజయవాడలోని మెగల్రాజపురంలో ఈ సంస్థ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసిందని పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది జూలై 28న NTR జిల్లా నందిగామలోని రైతుపేటలో ఇంటర్ విద్యార్ధిని హరిత వర్షిణి ఆత్మహత్య చేసుకొంది. లోన్ రికవరీ ఏజంట్ల వేధింపుల కారణంగానే హరిత వర్షిణి ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.ఈ విషయమై కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేసినట్టుగా డీసీపీ వివరించారు. ఆర్‌బీఐ గైడ్ లైన్స్ నిబంధనల మేరకు డబ్బులు వసూలు చేయాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. డబ్బుల రికవరీతో పాటు అసభ్యంగా వ్యవహరించడం, దూషించడంచేయవద్దని కూడా నిబంధనలు చెబుతున్నాయని డీసీపీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చామని డీపీసీ తెలిపారు. హరిత వర్షిణి తండ్రి రెండు క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 6.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బులు తిరిగి చెల్లించలేదు. దీంతో రికవరీ ఏజంట్లు రంగంలోకి దిగారు. హరిత వర్షిణి ఇంటికి వచ్చి అమానించారు. దీంతో మనోవేదనకు గురైన హరిత వర్షిణి ఆత్మహత్య చేసుకొంది.
ఆత్మహత్య చేసుకొనే ముందు హరిత వర్షిని రాసిన సూసైడ్ లేఖ కంటతడిపెట్టిస్తుంది. తన సోదరిని మంచిగా చదివించాలని ఆమె ఆ లేఖలో తల్లిని కోరింది.ఎంసెట్ లో తక్కువ మార్కులు వచ్చినందుకు సూసైడ్ చేసుకొన్నానని చెప్పాలని ఆ లేఖలో తల్లికి సూచించింది హరిత వర్షిణి.