బాబుకే కాదు, కెసిఆర్ కూ దావోస్ ఆహ్వానం

Published : Nov 10, 2016, 04:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
బాబుకే కాదు, కెసిఆర్ కూ దావోస్ ఆహ్వానం

సారాంశం

దావోస్  ఆహ్వానాన్ని ప్రపంచ రికార్డుగా ఆంధ్ర సిఎం సంబరం చేసుకుంటున్నపుడు తెలంగాణా సిఎంకు కూడా అహ్వానం అందింది

పొంగిపొరలుతున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సెలెబ్రేషన్ పూర్తికాక ముందే ప్రపంచ ఆర్ధిక వేదిక  (ఎకనమిక్ ఫోరమ్) నీళ్లు చల్లింది. 2017 దావోస్ సదస్సుకు మీటింగ్ రమ్మని  తెలంగాణా ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావు కు కూడా ఆహ్వానం పంపింది.  ఆంధ్ర ముఖ్యమంత్రికి పంపినట్లే ఒక చక్కటి  అభినందన లేఖ రాస్తూ, దావోస్ వార్షిక సదస్సుకు రావాలని ఈ వేదిక  కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రొఫెసర్ క్లాస్‌ ష్వాబ్ కెసిఆర్ ను కూడా ఆహ్వానించారు.  ప్రొఫెసర్ ష్వాబ్ కొద్ది రోజులు అగాల్సింది. ఎందుకంటే, ఆంధ్ర ముఖ్యమంత్రి ఈ ఆహ్వాన లేఖని వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ గా చూపించుకుని మురిసిపోతున్నారు.

 

 వరుసగా మూడో సారి దక్కిన ఆహ్వానమని, అసలు దావోస్ క్లబ్ ఆయన లేకుండా జరగదని, ముఖ్యమంత్రిగా ఉన్నా పిలుస్తారని, ప్రతిపక్షంలో ఉన్నా కూడా పిలిచారని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ న్యూసింకా అన్ని పేపర్ల మీద ఇంకనే లేదు, తెలంగాణా ముఖ్యమంత్రి కి కూ ఆహ్వాన పత్రిక అందింది. వూరికే లేఖ రాయడమే కాకుండ తెలంగాణాలో సులభంగా వ్యాపారం చేసుకునేందుకు కెసిఆర్  ప్రభుత్వం తీసుకొచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఇఒడిబి)లో , దేశంలొో  29 వ రాష్ట్రమయిన తెలంగాణా ఏకంగా నెంబర్ వన్ స్థానానికి రెండున్నరేళ్లలోనే చేరుకోవడానికి అభినందనలు కూడా చెప్పారు.

 

 ప్రపంచబ్యాంకు, కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక శాఖ (డీఐపీపీ) ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో తెలంగాణ రాష్ట్రం ఈవోడీబీ సంస్కరణల్లో మొదటి స్థానంలో నిలువడం సీఎం కేసీఆర్ అసాధారణ నాయకత్వానికి, రాష్ట్రం పట్ల ఆయనకున్న దార్శనికతకు నిలువెత్తు నిదర్శనమని ఆ సందేశంలో పేర్కొన్నారు.  ఈ విజయాన్ని సద్సస్సుకొచ్చే వారితో పంచుకునేందుకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనాలని సీఎం కేసీఆర్‌ను ష్వాబ్ ఆహ్వానించారు.

 

అయినవీ కానివి కూడా ఆంధ్రా ముఖ్యమంత్రి తన ఖాతాలో వేసుకునేందుకు ఉబలాట పడుతుంటారు. ఈ విషయంలో బాగా తొందరపాటు. నదలు అనుసంధానం తనదే అన్నారు.  కృష్ణా జలాలు రాయలసీమకు తానే తీసుకుపోతున్నానని అన్నారు. నిజానికి  దీనికోసం ప్రాజక్టు కట్టింది వైఎస్ఆర్. అవుకురిజర్వాయర్ నుంచి కడపజిల్లా గండికోట్ల సొరంగం ద్వారా తీసుకెళ్లే పని కూడా పూర్తయింది.) దావోస్ అహ్వానం తనకు కాబట్టి మూడుసార్లొచ్చాయన్నారు. ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు ఆలోచన తనదే నని,దీనికి సాక్ష్యంగా తాను ప్రధానికి రాసిన లేఖను ఆయన కార్యాలయం ఒక వైపు నుంచి, కుమారుడు మరొక వైపు నుంచి చూపిస్తున్నారు.

 

ఇలాంటి సంబరాల మధ్య కెసిఆర్ కు దావోస్ వారు ఆహ్వానం పంపారు. 

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu