
‘వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీదే అధికారం’. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. తెలంగాణా సిఎం కెసిఆర్. వచ్చే ఎన్నికల్లో ఏపిలో ఎవరికి అధికారం దక్కుతుందన్న విషయంలో సర్వే జరిగిందట. సర్వే గురించి ఓ మిత్రుడు తనకు చెప్పారంటూ కెసిఆర్ కొన్ని వివరాలు చెప్పారు. దాని ప్రకారం వచ్చే ఎన్నికల్లో జగన కే అధికారం. వైసీపీకి 45 శాతం ఓట్లు వస్తాయట. టిడిపికి 43 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు. ఇక, భారతీయ జనతా పార్టీకి 2.6 శాతం , అదే విధంగా జనసేనకు 1.2 శాతం మత్రమే ఓట్లు వస్తాయని చెప్పారట.
కెసిఆర్ చెప్పిన సర్వే వివరాలు చంద్రబాబుకు అంతకంటే పవన్ కే పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. ప్రభుత్వంపై పెరిగిపోతున్న జనాల వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి చంద్రబాబుకు వచ్చే ఎన్నకల ఫలితాలపై ఓ అంచనా ఉంటుంది. మరి, పవన్ పరిస్ధితేంటి? వచ్చే ఎన్నకల్లో కూడా కింగ్ మేకర్ అవుదామనో లేక ఏకంగా కింగే అవుదామనో పవన్ అనుకుంటున్నారు. అందుకనే కదా చంద్రబాబు, జగన్ ఇద్దరూ పవన్ను తమతో కలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. మరి, కెసిఆర్ తాజాగా చెప్పిన వివరాలతో పవన్ విషయంలో ఇద్దరూ పునరాలోచనలో పడతారా? ఏమో ఏం జరుగుతుందో చూడాలి.