శారద పీఠంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు (వీడియో)

Published : Dec 23, 2018, 02:06 PM ISTUpdated : Dec 23, 2018, 02:28 PM IST
శారద పీఠంలో  కేసీఆర్ ప్రత్యేక పూజలు (వీడియో)

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి శారద పీఠంలో ఆదివారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

విశాఖపట్టణం: తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి శారద పీఠంలో ఆదివారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి విశాఖకు చేరుకొన్నారు.విశాఖ విమానాశ్రయం నుండి ఆయన నేరుగా శారద పీఠానికి చేరుకొన్నారు.

శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్రను కేసీఆర్ ఘనంగా సన్మానించారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకొన్నారు.ఈ ఆశ్రమం ఆవరణలో ఉన్న రాజశ్యామల ఆలయంలో స్వరూపానందేంద్రతో కలిసి కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి రెండు రోజుల ముందు కూడ కేసీఆర్  తన ఫామ్‌హౌజ్‌లో స్వరూపానందేంద్రతో కలిసి కేసీఆర్ రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. యాగం ముగించుకొని ఆయన ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లను కైవసం చేసుకొంది. దీంతో స్వామి ఆశీస్సులు తీసుకొనేందుకు కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి విశాఖ శారద పీఠానికి వచ్చారు.

"

సంబంధిత వార్తలు

విశాఖ శారదా పీఠంలో అడుగుపెట్టిన కేసీఆర్

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu