కేసీఆర్ సర్వే సంచలనం: చంద్రబాబుకు, జగన్ కు మధ్య తేడా ఇంతే...

By pratap reddyFirst Published Jan 13, 2019, 10:37 AM IST
Highlights

చంద్రబాబును ఓడించే ఉద్దేశంతో రంగంలోకి దిగాలని భావిస్తున్న కేసీఆర్ ఆ సర్వేను నిర్వహించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో పాటు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎపి ఎన్నికల్లో వైఎస్ జగన్ కు మద్దతుగా రంగంలోకి దిగే అవకాశాలున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన కేసీఆర్ అందుకు తగిన నేపథ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబును ఓడించే ఉద్దేశంతో రంగంలోకి దిగాలని భావిస్తున్న కేసీఆర్ ఆ సర్వేను నిర్వహించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో పాటు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎపి ఎన్నికల్లో వైఎస్ జగన్ కు మద్దతుగా రంగంలోకి దిగే అవకాశాలున్న విషయం తెలిసిందే.

రెండు నెలల క్రితం కేసీఆర్ సర్వే నిర్వహించారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 2.5 శాతం మాత్రమే ఉన్నట్లు ఆ సర్వేలో తేలినట్లు సమాచారం. దీంతో వైఎస్ జగన్ ను ఎదుర్కునేందుకు చంద్రబాబు తగిన వ్యూహాలను రచిస్తున్నారు. 

జగన్ ను దెబ్బ కొట్టే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు పెన్షన్లను వేయి రూపాయల నుంచి 2 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారని అంటున్నారు. అదే సమయంలో దివ్యాంగులకు నెలకు 10 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని తాజాగా శనివారంనాడు ప్రకటించారు. తద్వారా జగన్ ను ధీటుగా ఎదుర్కోగలమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని తెలుగుదేశం అధినేత భావిస్తున్నారు. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నప్పటికీ అది వివిధ కారణాల వల్ల సాధ్యం కావడం లేదని సమాచారం. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని వైసిపి ప్రకటించింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన వామపక్షాలతో కలిసి ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తోంది. 

click me!