అన్నా క్యాంటీన్ లో బూతు భాగోతం: రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వైనం

Published : Jan 13, 2019, 08:59 AM IST
అన్నా క్యాంటీన్ లో బూతు భాగోతం: రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వైనం

సారాంశం

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం అన్నా క్యాంటీన్. రూ.5కే పేదోడి కడుపునింపాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పథకం స్వరూపాన్నే మార్చేశారు అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన కొంతమంది వ్యక్తులు. 

హిందూపురం : తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం అన్నా క్యాంటీన్. రూ.5కే పేదోడి కడుపునింపాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పథకం స్వరూపాన్నే మార్చేశారు అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన కొంతమంది వ్యక్తులు. 

పదిమందికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్‌ను వ్యభిచార కేంద్రంగా మార్చేశారంటూ ప్రచారం జరుగుతోంది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్‌లో రాత్రి వేళల్లో వ్యభిచారం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో శనివారం గ్రామానికి చెందిన స్థానికులు కాపుకాశారు. 

శనివారం సాయంత్రం వాచ్ మెన్ మరో మహిళతో రాసలీలు జరుపుతుండగా పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు మీడియాకు సమాచారం ఇచ్చారు. మీడియా ప్రతినిధులు వాచ్ మెన్ ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. కేసు నమోదు చేసి విచారించాల్సిన పోలీసులు వారిని వదిలేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu