చంద్రబాబుకి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్: సీరియల్ లో ఒక భాగం ఇదే....

First Published Feb 19, 2019, 6:38 PM IST

చంద్రబాబుకి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్: సీరియల్ లో ఒక భాగం ఇదే....
 

హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించారా....? తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నేతలు వైసీపీలో చేరడానికి కారణం కేసీఆర్ వ్యూహంలో భాగమేనా....?
undefined
సినీ ఇండస్ట్రీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా జగన్ కు మద్దతు పలకడం వెనుక దాగి ఉన్న ఆంతర్యం ఏంటి....? వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ హైదరాబాద్ అడ్డాగానే సాగుతుందన్న వార్తల్లో వాస్తవమెంత....? ఇవే తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ.
undefined
అధికార తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేతలు పార్టీ వీడి ప్రతిపక్ష పార్టీలో చేరడం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లాన్ ఎంత ఉందో లేదో తెలియదు కానీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
undefined
ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక కేసీఆర్ వ్యూహం దాగి ఉందని సమాచారం. అలాగే ఆంధ్రాలో కేసీఆర్ వదిలిన అస్త్రం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటూ ప్రచారం జరుగుతుంది.
undefined
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఏపీపై వదిలి బీసీ సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఈ విషయంలో ఇప్పటికే చాలా వరకు విజయవంతమయ్యారని తెలుస్తోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే ఏపీలో రెండు సార్లు పర్యటించారు.
undefined
బీసీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు కూడా. ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, త్వరలో వైసీపీలో చేరబోయే కొంతమంది టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ పసిగట్టిందని ప్రచారం.
undefined
అందువల్లే తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీలో వలసలు వెనుక కేసీఆర్, కేటీఆర్ కుట్ర దాగి ఉందంటూ ఆరోపిస్తున్నారు. ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ తోపాటు టీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతలు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారే.
undefined
వారికి ఉన్న పరిచయాలతో కేసీఆర్ వారిని వైసీపీలోకి వెళ్లాలని అక్కడ ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చూస్తానని హామీ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రభావితం చేసే రంగం సినీ ఇండస్ట్రీ. సినీ ఇండస్ట్రీ దాదాపుగా తెలుగుదేశం పార్టీవైపే మెుగ్గు చూపుతూ వస్తోంది.
undefined
అయితే ఈ ఎన్నికల్లో సీన్ అంతా రివర్స్ అయ్యింది. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వైసీపీలో చేరుతున్నారు. సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన అక్కినేని నాగార్జున వైసీపీవైపు మెుగ్గు చూపడం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కీలక పాత్ర పోషించారని ప్రచారం జరుగుతుంది.
undefined
తెలంగాణ ప్రభుత్వం అక్కినేని నాగార్జున కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఇస్తోంది. చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా అక్కినేని నాగార్జున కోడలు హీరోయిన్ సమంతను నియమించింది. ఆ పరిచయాల నేపథ్యంలో అక్కినేని నాగార్జున వైఎస్ జగన్ వైపు మల్లడానికి కీలక కారణమని ప్రచారం.
undefined
ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు సైతం జగన్ ను కలవడం వెనుక కేసీఆర్ ప్లాన్ ఉందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వీరంతా అన్ని రంగాల్లో కీలక స్థానంలో ఉన్నారు. వీరంతా జగన్ కు వచ్చే ఎన్నికల్లో సహాయం చెయ్యాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
undefined
ఇకపోతే ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు జగన్ వెంటే ఉంటామని ప్రకటించారు. ముఖ్యంగా ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ, అలనాటి హీరో భానుచందర్, నటులు కృష్ణుడు, మార్గాని భరత్, సుమంత్, ఫిష్ వెంకట్, జబర్దస్త్ లోని పలువురు ఆర్టిస్టులు జగన్ కు జై కొట్టారు.
undefined
ఇకపోతే డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుటుంబం ఎలాగూ వైఎస్ జగన్ వైపే ఉంటుంది. వైఎస్ జగన్ కు దగ్గరి బంధుత్వం ఉన్న నేపథ్యంలో మంచు మోహన్ బాబు కుటుంబం వైఎస్ జగన్ కే తమ మద్దతు పలకనున్నారు. ఇటీవలే వైఎస్ జగన్ పై జరిగిన కత్తిదాడిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు మోహన్ బాబు.
undefined
అంతేకాదు తనకు అనారోగ్యం ఉన్నా లెక్కచెయ్యకుండా లోటస్ పాండ్ కి వెళ్లి వైఎస్ జగన్ ను పరామర్శించారు మోహన్ బాబు. ఇకపోతే ఇటీవలే ఆయన తనయుడు మంచు విష్ణువర్థన్ కూడా కుటుంబ సమేతంగా వైఎస్ జగన్ ను కలిశారు.
undefined
మరోవైపు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానని గత ఎన్నికల్లో సవాల్ విసిరారు. అంతేకాదు తన మిత్రుడు జగన్ కి మద్దతుగా ఏపీలో పర్యటిస్తానని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏపీ ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
undefined
ఏపీలో ముస్లిం మైనారిటీ ఓటర్ల జాబితాపై అధ్యయనం చేస్తున్నారట. ఇప్పటికే కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కర్నూలులో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ బోణీ కూడా కొట్టింది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ పై ఫోకస్ పెట్టేశారు. మరి అసదుద్దీన్ ఓవైసీ కూడా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
undefined
click me!