‘రంగా’ కేంద్రంగా ‘కాపు’ల సరికొత్త రాజకీయం ?

First Published Dec 26, 2017, 1:54 PM IST
Highlights
  • వంగవీటి రంగా కేంద్రంగా కాపు నేతలు సరికొత్త రాజకీయానికి తెరలేపుతున్నారా?  

వంగవీటి రంగా కేంద్రంగా కాపు నేతలు సరికొత్త రాజకీయానికి తెరలేపుతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అదే అనుమానాలు మొదలయ్యాయి. రాజకీయంగా రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకు ధీటుగా ఎదగాలని కాపు సామాజికవర్గంలో బలమైన కోరిక ఎప్పటి నుండో ఉంది. కాకపోతే పరిస్దితులో అనుకూలించటం లేదు. కాబట్టి కాపు సామాజికవవర్గంలోని బలమైన నేతల్లో వివిధ పార్టీల్లో సర్దుకున్నారు.

ఇటువంటి నేపధ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి దూకి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. దాంతో కాపు నేతల్లో చాలామంది పిఆర్పీలో చేరారు. అయితే దాని కథ ఏమైందో అందరికీ తెలిసిందే. దాంతో తర్వాత ఇంకెవరూ ప్రత్యేకపార్టీ ఏర్పాటు దిశగా ఆలోచించలేదు. నిజానికి కాపులకు ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసేంత స్ధాయున్న నేత కూడా ఎవరూ లేరనే చెప్పాలి.

అయితే, 2014 ఎన్నికలకు ముందు చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ హటాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పేరుతో ఓ పార్టీ ఏర్పాటు చేసారు. పవన్ పెట్టిన పార్టీపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉన్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో జనసేన పాత్రపై మిశ్రమ స్పందన కనబడుతోంది. దానికితోడు కాపులకు రిజర్వేషన్ పేరుతో కాపుల్లోని చంద్రబాబు వ్యతరేకులంతా మొన్నటి వరకూ ముద్రగడ వెంటున్నారు.

రానున్న ఎన్నికలను దృష్టి పెట్టుకున్న చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించి బిసిల్లో చేర్చిన సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు నిర్ణయంతో కాపుల పోరాటానికి ఒక అంశమంటూ లేకపోయింది. వచ్చే ఎన్నికల్లో అస్తిత్వాన్ని చాటుకోవాలంటే వారికి దారేదీ కనబడలేదు. అటువంటి పరిస్దతిల్లోనే కాపు సామాజికవర్గానికి వంగవీటి రంగా వర్ధంతి కలిసివచ్చింది.

సరే, రంగా కాపు సామాజికవర్గానికి చెందిన నేతే అయినప్పటికీ దాదాపు అన్నీ సామాజికవర్గాలపైనా చెరగని ముద్ర వేసారు. ఆ పాయింటునే పట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఉనికిని చాటు కోవాలనే ప్రయత్నాలు మొదలయ్యాయా అన్న అనుమానాలు బయలుదేరాయి. మంగళవారం వంగవీటిరంగా 29వ వర్ధంతి పేరుతో విజయవాడ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న హడావుడి అనుమానాలకు ఊతమిస్తోంది. రంగా బొమ్మ పెట్టుకుని, పేరు చెప్పుకుని  వచ్చే ఎన్నికల్లో  లబ్దిపొందాలన్నది కాపు నేతల వ్యూహంగా కనబడుతోంది. మరి వీరు ఏ మేరకు లబ్దిపొందుతారో చూడాలి.

click me!