ఆ రంగారావు.. ఈ రంగారావా , బాలయ్యపై కాపునాడు ఆగ్రహం: క్షమాపణలకు డిమాండ్.. 25 వరకు డెడ్‌లైన్

By Siva KodatiFirst Published Jan 24, 2023, 5:21 PM IST
Highlights

దివంగత మహానటుడు ఎస్వీ రంగారావుపై సినీనటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కాపునాడు భగ్గుమంది. బాలకృష్ణ మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ఆ వ్యాఖ్యలు కాపుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొంది.

సినీనటుడు , టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల వీర సింహారెడ్డి సక్సెస్ మీట్‌లో దివంగత మహానటుడు ఎస్వీ రంగారావుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై కాపునాడు భగ్గుమంది. ఈ సందర్భంగా బాలకృష్ణ, టీడీపీకి కాపునాడు అల్టీమేటం జారీ చేసింది. బాలయ్య వ్యాఖ్యలు.. కాపుల గుండెల్లో గునపాలు దింపాయన్నారు. మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అంటారా అంటూ కాపునాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్వీ రంగారావును ఆ రంగారావు.. ఈ రంగారావు అంటారా అంటారా అంటూ ఫైర్ అయ్యింది. బాలకృష్ణ మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ఆ వ్యాఖ్యలు కాపుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొంది.

ఇదిలావుండగా..`వీరసింహారెడ్డి` సక్సెస్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అక్కినేని, ఎస్వీరంగారావులపై ఆయన చేసిన కామెంట్లు, హిందీలో ప్రసంగానికి సంబంధించిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌కి సమకాలీకులుగా రాణించిన అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీఆర్‌లపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అక్కినేని హీరోలు స్పందించారు. నాగచైతన్య, అఖిల్‌ సోషల్‌ మీడియా ద్వారా బాలయ్యకి కౌంటర్లిచ్చారు. దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. `నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అలాగే ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరచుకోవడం` అంటూ బాలయ్యకి చురకలంటించారు. ట్విట్టర్‌ ద్వారా చైతూ, అఖిల్‌ ఒకే పోస్ట్ ని అభిమానులతో షేర్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌ అవుతుంది. ఇది వివాదాన్ని మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారనేది మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది.

అయితే ఇప్పటి వరకు దీనిపై అక్కినేని నాగార్జున స్పందించలేదు. ఇప్పటికే బాలకృష్ణకి, నాగార్జునకి పడదు, వీరిద్దరి మధ్య విభేదాలున్నాయనే వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. వీరిద్దరు కలుసుకున్న సందర్భాలు చాలా అరుదు. అందుకే వారి మధ్య ఏవో ఉన్నాయని అంటుంటారు. అందుకు తగ్గట్టుగానే వారి వ్యవహారశైలి ఉంటుంది. అది బాలయ్య వ్యాఖ్యలతో మరింత చర్చనీయాంశంగా మారడంతోపాటు ఆ రూమర్లకి బలాన్ని చేకూరుస్తుంది. ఎన్టీఆర్‌ తనయుడు అయినంత మాత్రానా బాలకృష్ణ.. అక్కినేనికి సమకాళీకులు కాలేరు. ఏఎన్నార్‌ ఓ లెజెండ్‌, తొలితరం దిగ్గజాలలో ఆయన ఒకరు. అలాంటి ఏఎన్నార్‌ని తీసి పడేసినట్టుగా బాలకృష్ణ మాట్లాడటం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. 

ఇటీవల `వీరసింహారెడ్డి` సక్సెస్‌ సెలబ్రేషన్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ, జయరాం అనే రైటర్‌, ఆర్టిస్టు గురించి చెబుతూ, ఈయన సెట్‌లో ఉన్నారంటే నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునేవాళ్లం` అని తన నోటి దురుసుని ప్రదర్శించారు బాలయ్య. ఆ ఫ్లోలో నోటికొచ్చింది మాట్లాడుకుంటూ వెళ్లారు. అదే కాదు, ఏపీ ప్రభుత్వంపై, అలాగే హిందీలో స్పీచ్‌ అంటూ `అమ్మ....`పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి క్రమంగా వైరల్‌గా మారి, వివాదాలకు దారి తీశాయి. ఇప్పుడు పెద్ద రచ్చ అవుతున్నాయి. 
 

click me!