అది కొత్తగా తీర్మానం చేయాల్సిన పని లేదు.. బీజేపీని బలహీనపరచాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త: బీజేపీ ఎంపీ జీవీఎల్

By Sumanth KanukulaFirst Published Jan 24, 2023, 4:18 PM IST
Highlights

బీజేపీని కుట్రపూరితంగా బలహీనపరిచే రాజకీయాలు ఎవరైనా చేస్తే తస్మాత్ జాగ్రత్త అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు హెచ్చరించారు.

బీజేపీని కుట్రపూరితంగా బలహీనపరిచే రాజకీయాలు ఎవరైనా చేస్తే తస్మాత్ జాగ్రత్త అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు హెచ్చరించారు. బీజేపీని పలుచన చేద్దాం, నాయకులను లాగేద్దాం, దుష్ప్రచారం చేద్దామని చూస్తే.. అంతకుఅంత అనుభవించక తప్పదని అన్నారు. భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా జీవీఎల్ నర్సింహారావు  మీడియాతో మాట్లాడుతూ.. 2014 తర్వాత అధికారం చేపట్టిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచాయని, అభివృద్ది పూర్తిగా  నిర్వీర్యం చేశాయని విమర్శించారు. కేంద్ర  ప్రభుత్వ పథకాల విషయంలో వారి స్టిక్కర్లు వేసుకున్నారని మండిపడ్డారు.

వైసీపీ, టీడీపీలు రెండు కుటుంబ పార్టీలేనని.. అవినీతికి పాల్పడిన పార్టీలేనని  విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా.. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్దిని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. తాము టీడీపీ, వైసీపీలకు ప్రత్యర్థి అని స్పష్టం చేశారు. గత మూడున్నరేళ్లలో వైసీపీ పూర్తిగా వైఫల్యం చెందిందని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించడం జరిగిందని  చెప్పారు. వైసీపీ, టీడీపీలు కుట్రపూరితంగా బీజేపీని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. జనసేన పొత్తు గురించి తీర్మానం చేయకపోవడంపై మీడియా ప్రశ్నించగా.. కొత్తగా తీర్మానం  చేయాల్సిన అవసరం ఏముందని, ఎప్పుడో చేశామని అన్నారు.
 

click me!