వంగవీటి రంగా హత్యపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్ధరహితం:కాపు నేత నరసింహారావు

Published : Oct 19, 2022, 05:21 PM ISTUpdated : Oct 19, 2022, 05:24 PM IST
వంగవీటి రంగా హత్యపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్ధరహితం:కాపు నేత నరసింహారావు

సారాంశం

వంగవీటి రంగా హత్యకు కాపులు,బలిజలు కారణమని  పవన్ కళ్యాణ్  చేసిన వ్యాఖ్యలను కాపు నేత నరసింహరావు తప్పు బట్టారు. ఈ వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు.

అమరావతి:  కాపు నేత వంగవీటి రంగా  హత్య కేసు విషయమై జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కాపు నేత నరసింహరావు తప్పుబట్టారు వంగవీటి రంగా హత్య విషయంలో మంగళవారంనాడు మంగళగిరిలో నిర్వహించిన  పార్టీ  కార్యకర్తల సమావేశంలో  పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.వంగవీటి రంగాను కాపాడుకోలేకపోవడం కాపులు,బలిజల  తప్పేనన్నారు.  

వంగవీటి  రంగా హత్యపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు.రంగా హత్యకు కాపులే కారణమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు  దురదృష్టకరమన్నారు.. రాజకీయ అవసరాల కోసం రంగా హత్యకు సాకుగా  చూపడం శోచనీయమన్నారు. వంగవీటి రంగా హత్య విషయంలో  పవన్ కళ్యాణ్  వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ  నిన్ననే తప్పు బట్టారు.  వంగవీటి రంగా హత్యకు కారణం ఎవరో చెప్పాలన్నారు. ఎవరి  పంచన చేరి పవన్ కళ్యాణ్ ఈ  వ్యాఖ్యలు  చేస్తున్నారని  ఆయన ప్రశ్నించారు.

విశాఖలో  ఈ నెల 15న విశాఖ గర్జనకు హాజరౌతున్న మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు దాడులకు దిగారని వైసీపీ ఆరోపించింది. ఈ దాడితో తమకు సంబంధం లేదని జనసేన ప్రకటించింది. విశాఖ గర్జన ఫెయిల్  కావడంతో దాడి  డ్రామా ఆడుతున్నారని  జనసేన  ఆరోపించింది. చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకొని పవన్  కళ్యాణ్ విశాఖలో  పర్యటించారన్నారు.

alsoread:యుద్ధానికి పనికిరాడు:పవన్ కళ్యాణ్ పై మంత్రి అప్పల రాజు కౌంటర్

తనను ప్యాకేజీ తీసుకొనే నేత అంటూ వైసీపీ చేసే ప్రచారంపై పవన్  కళ్యాణ్ నిన్న విరుచుకుపడ్డారు.ప్యాకేజీ అంటూ మాట్లాడితే చెప్పుతో కొడతానన్నారు..వైసీపీపై వపన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ కూడ అదే స్థాయిలో స్పందించింది. పవన్ కళ్యాణ్ పై మంత్రులు ,వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్