శ్రీశైలంలో టీ షాపుకు నిప్పుపెట్టిన కన్నడ భక్తులు, ఒకరికి తీవ్రగాయాలు.. పరిస్థితి ఉద్రిక్తం...

Published : Mar 31, 2022, 08:28 AM IST
శ్రీశైలంలో టీ షాపుకు నిప్పుపెట్టిన కన్నడ భక్తులు, ఒకరికి తీవ్రగాయాలు.. పరిస్థితి ఉద్రిక్తం...

సారాంశం

శ్రీశైలంలో కన్నడ భక్తుల రాకతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆలయానికి ఆనుకుని ఉన్న వీధుల్లో కన్నడ భక్తులు వీరంగం సృష్టించారు. టీ షాపుకు నిప్పుపెట్టి రెచ్చిపోయారు. దీంతో జరిగిన గొడవల్లో ఓ కన్నడభక్తుడికి తీవ్రగాయాలయ్యాయి. 

శ్రీశైలం : ప్రముఖ పుణ్యక్షేత్రం srisailamలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ పురవీధుల్లో కన్నడ భక్తులు వీరంగం సృష్టించారు. ఓ టీ దుకాణం వద్ద kannada devotees, స్థానికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో తాత్కాలిక దుకాణాలు, కార్లు, ద్విచక్రవాహానాలమీద దాడి జరిగింది. kannada youth టీ దుకాణాలకు నిప్పు పెట్టారు. ప్రతిదాడిలో కన్నడ భక్తుడికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వెంటనే బాధితుడిని ఆసుపత్రికి  తరలించారు. దుకాణాలమీద దాడులతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాయపడ్డ యువకుడిని జగద్గురు పీఠాధిపతి పరామర్శించారు. 

ఇదిలా ఉండగా,  srisailamలో ఉగాది ఉత్సవాలకు ముందే అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ugadi తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా ప్రముఖంగా జరుపుకుంటారు. దీనికోసం Karnataka, Maharashtra సరిహద్దు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారికి చీరలు ఇతరత్రా నైవేద్యాలు తీసుకుని వస్తుంటారు. అయితే ఈ యేడు ఇది ఎక్కువగా ఉండడంతో  శ్రీశైలంలో ఆలయ అధికారులు, స్థానికులు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. 

గత రెండేళ్లుగా కరోనా కారణంగా Ugadi celebrations మామూలుగా కానిచ్చేశారు. కానీ ఈ యేడు ఆ ప్రభావం సద్ధుమణగడంతో పొరుగు రాష్ట్రాల నుండి దర్శనం కోసం వచ్చే devotees రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతోపాటు వచ్చే భక్తుల్లోని పురుషులు Alcohol సేవించి ఆలయానికి వస్తుండడంతో ఆలయ అధికారులు పరిస్థితిని అదుపు చేయలేకపోతున్నట్లు సమాచారం. పలువురు భక్తులు ఆలయ సిబ్బంది, స్థానికంగా దుకాణాలు నడుపుతున్న వారిపై దాడి చేశారు.

దర్శనాలు వాయిదా వేసుకోవాలి...
ఈ నేపథ్యంలో ఉగాది వరకు శ్రీశైలం దర్శనానికి రాకుండా తమ షెడ్యూల్ మార్చుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భక్తులను  శ్రీశైలం ఆలయ ఈఓ లవన్న కోరారు. ఉగాది పర్వదినంకోసం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి  శివభక్తులు పాదయాత్ర చేస్తూ వస్తారు. ఆయా రాష్ట్రాలను కలుపుతూ ఉండే నల్లమల అడవుల గుండా శ్రీశైలం వైపు వెళ్లే రహదారుల్లో వీరు ప్రయాణిస్తారు. అందుకే ఉగాది సమయంలో నల్లమల అడవులు ఈ పాదయాత్ర చేసే భక్తులతో కనిపిస్తుంటుంది. 

శతాబ్దాల చరిత్ర..
దీని వెనుక శతాబ్దాల నాటి సంప్రదాయం ఉంది. శ్రీశైలంలోని భ్రమిరాంబికను వారు తమ కుమార్తెగా భావిస్తారు. మల్లికార్జున స్వామిని తమ అల్లుడిగా పూజిస్తారు. ఉగాది సందర్భంగా 'కూతురు', 'అల్లుడు'లను తమ ఇళ్లకు ఆహ్వానించేందుకు ఆలయానికి వస్తారు.

అందుకే ఉగాది ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రల శివ భక్తులకు ప్రత్యేక ఉత్సవం. కోవిడ్ మహమ్మారికి ముందు, ఉగాది సందర్భంగా మూడు లక్షల మందికి పైగా భక్తులు పాదయాత్రతో వచ్చి దర్శనం చేసుకున్నారు. అయితే, కరోనా కారణంగా ఈ రెండేళ్లు రాకపోవడంతో.. "ఈసారి భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది" అని అధికారిక వర్గాలు తెలిపాయి.

నల్లమల అడవులు, కనెక్టింగ్ రోడ్లలో పాదయాత్ర చేస్తున్న భక్తులకు స్వచ్ఛంద సంస్థలు ఆహారం, నీరు, వైద్యసహాయం అందిస్తున్నాయి. బీదర్, గుల్బర్గా, బెల్గాం, మహారాష్ట్ర సరిహద్దు పట్టణాల నుండి భక్తులు కవాడియాలతో శ్రీశైలానికి నడుస్తారు. "ప్రతి ఉగాదికి అమ్మవారిని ప్రార్థించడానికి మేమిక్కడికి వస్తాం. మమ్మల్ని, మా కుటుంబాలను రక్షించే 'మహా శక్తి'గా భావించి పూజిస్తాం. దానికి తగ్గట్టే ఆమె మాకు శుభాలు కలిగిస్తుంది" అని కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన మంజునాథ్ అనే భక్తుడు చెప్పారు.

అలంకార దర్శనం మాత్రమే..
భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయంలో స్పర్శ దర్శనం నిలిచిపోయింది. అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంది. దర్శనం కోసం గంటల తరబడి ఆలస్యం కావడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది భక్తులు క్యూ లైన్లలో కంపార్ట్‌మెంట్లు / ఫెన్సింగ్‌లను ధ్వంసం చేశారు. దీంతో ఉగాది వరకు ఆర్జిత సేవా టిక్కెట్లను కూడా నిలిపివేసారు.

టోల్‌గేట్ వద్ద నిరసన...
దీంతోపాటు, మంగళవారం ఉత్తర కర్ణాటక పాదయాత్ర భక్తులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ టోల్‌గేట్ వద్ద నిరసనకు దిగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఐదు గంటలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతో.. ఇతర భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. ఆలయ అధికారులు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. ఇలాగే మూడేళ్ల క్రితం పలువురు భక్తులు మద్యం మత్తులో దుకాణాలపై దాడులు చేయడంతో నష్టం వాటిల్లింది. దీంతో అలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా శ్రీశైలం, సమీప ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?