చంద్రబాబుతో మాకేం అవసరం లేదు, టీడీపీ ఖాళీ ఖాయం: కన్నా

By Nagaraju penumalaFirst Published Jul 13, 2019, 3:26 PM IST
Highlights

ఇదంతా రొటీన్ కదా అనుకునేలోపు మరో బాంబు పేల్చారు. టీడీపీలోని 7 లేదా 8 మందిని తప్ప మిగిలిన వారిని అందర్నీ చేర్చుకుంటామంటూ చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ నేతలు కూడా టచ్ లో ఉన్నారని మరో బాంబు పేల్చారు. 

గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో ఏ బీజేపీ నేతను కదిపినా వచ్చే మెుదటి మాట మాతో చాలా మంది టచ్ లో ఉన్నారు. టీడీపీ నుంచి ఇంతమంది, టీఆర్ఎస్ నుంచి అంతమంది బీజేపీలో చేరిపోవడానికి రెడీగా ఉన్నారంటూ ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. 

అక్కడితో ఆగడం లేదు. ఇంకా రెండు నెలల పాలన కూడా పూర్తి చేసుకోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ నేతలు నానా హంగామా చేస్తున్నారు. ఇదే అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణలో అయితే బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. 

అయితే ఇవే మాటలు చెప్పి చెప్పి వాళ్లకే బోరు కొట్టేసిందో లేక దానికి మరోకటి యాడ్ చేస్తే బాగుంటుందని భావించారో తెలియదు గానీ ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు చాలా మంది ఉత్సాహంతో ఉన్నారని, త్వరలో టీడీపీ ఖాళీ అయిపోవడం ఖాయమంటూ చెప్పుకొచ్చేశారు. 

ఇదంతా రొటీన్ కదా అనుకునేలోపు మరో బాంబు పేల్చారు. టీడీపీలోని 7 లేదా 8 మందిని తప్ప మిగిలిన వారిని అందర్నీ చేర్చుకుంటామంటూ చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ నేతలు కూడా టచ్ లో ఉన్నారని మరో బాంబు పేల్చారు. 

మరోవైపు బీజేపీకి చంద్రబాబు నాయుడు అవసరం ఉందన్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. తెలుగుదేశం పార్టీకే చంద్రబాబు నాయుడు అవసరం లేదని అలాంటిది బీజేపీకి ఏం అవసరం ఉంటుందన్నారు. మతిభ్రమించిన నేతలే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని విమర్శించారు.

బీజేపీలో రోజూ చేరికలు కొనసాగుతున్నాయన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీజేపీలో వలసలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. బీజేపీలో చేరికలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నలుగురం పంచుకుని పార్టీలో చేరేవారిని చేర్చుకుంటున్నట్లు బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 

click me!