వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ కు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతిస్పందించారు.కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి తాను సిద్దంగా ఉన్నానని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ కు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతిస్పందించారు.కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి తాను సిద్దంగా ఉన్నానని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
మంగళవారంనాడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కాణిపాకంలోనైనా వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని విజయసాయిరెడ్డి ప్రకటించారు.
undefined
also read:కన్నాకు విజయసాయి కౌంటర్: కాణిపాకంలోనే కాదు, వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తా
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని కన్ణా లక్ష్మీనారాయణ మంగళవారం నాడు స్పష్టం చేశారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఏ రోజున కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసేందుకు తేదీని నిర్ణయించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చెబుతానని కన్నా తేల్చి చెప్పారు.
విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర నేతలతో కన్నా లక్ష్మీనారాయణ మంగళవారంనాడు పార్టీ నేతలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సమయంలోనే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు మీడియాలో రావడంతో కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.