ఏపీలో కరోనా విజృంభణ: కొత్తగా 35 కేసులు, మొత్తం 757కి చేరిక

By narsimha lodeFirst Published Apr 21, 2020, 12:12 PM IST
Highlights

24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్  కేసులు 757కి చేరుకొన్నాయి.కరోనా వైరస్ సోకి ఇప్పటికే 22 మంది మృతి చెందినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

అమరావతి:24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్  కేసులు 757కి చేరుకొన్నాయి.కరోనా వైరస్ సోకి ఇప్పటికే 22 మంది మృతి చెందినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

 

రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 35 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 757 పాజిటివ్ కేసు లకు గాను 96 మంది డిశ్చార్జ్ కాగా, 22 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 639. pic.twitter.com/s3kAbZ8E1G

— ArogyaAndhra (@ArogyaAndhra)

కరోనా వైరస్ సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొంది  96 మంది డిశ్చార్జ్ అయినట్టుగా  ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.గత 24 గంటల్లో  కర్నూల్ లో 10, గుంటూరులో 09, తూర్పుగోదావరిలో 04, కడపలలో 06, అనంతపురంలో 03, కృష్ణాలో 03 కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

వివిధ జిల్లాలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి

అనంతపురం-36
చిత్తూరు-53
తూర్పుగోదావరి-26
గుంటూరు-158
కడప-46
కృష్ణా-83
కర్నూల్-184
నెల్లూరు-67
ప్రకాశం-44
విశాఖపట్టణం-21
పశ్చిమగోదావరి-39


రాష్ట్రంలోని మొత్తం 757 కరోనా పాజిటివ్ కేసుల్లో 639 కేసులు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటుంది. 

click me!