Kanna Lakshminarayana: హిందూ సమాజాన్ని నాశనం చేస్తున్నారు.. సీఎం జ‌గ‌న్ పై కన్నా ఫైర్

By Rajesh KFirst Published Jan 22, 2022, 3:29 PM IST
Highlights

Kanna Lakshminarayana: జగన్ సీఎం అయిన నాటి నుంచి  హిందూ సమాజాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ తప్ప మరొకటి ఉండకూడ‌ద‌ని భావిస్తున్నారన్నారు. 
 

Kanna Lakshminarayana: సీఎం జ‌గ‌న్ పై బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. జగన్ పాలనకు వచ్చినప్పటి నుండి హిందూ సమాజాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు.

కర్నూలులో జరుగుతున్న బిజెపి వర్చువల్ సమావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. హిందువులు అధికంగా ఉండే ప్రాంతంలో వారి అభిప్రాయాలకు వ్యతిరేకంగా ..  వారి అనుమతి లేకుండా మసీదు, చర్చీల‌ నిర్మాణం చేపట్టారన్నారు. క‌ర్నూల్ జిల్లా.. ఆత్మకూరులోని పద్మావతి పాఠశాల వెనకాల మసీదు నిర్మాణం విషయంలో వివాదం చెలరేగింది. దానిపై మాట్లాడేందుకు వెళ్లిన జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై పిఎస్ఐ ఆధ్వర్యంలో దాడి చేశారన్నారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. ఆయనన్ను విడుదల చేసేంత వరకూ ఆందోళన కొనసాగుతుందన్నారు.

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ తప్ప మరొకటి ఉండకూడ‌ద‌ని భావిస్తున్నారన్నారు. ఆ కంపెనీ ఆధ్వర్యంలోనే పేకాట క్లబ్ ల నిర్వహణ, మద్యం అమ్ముకోవటం, సినిమా టికెట్స్, విక్రయించడం, మాంసం దుకాణాల నిర్వహణ చేస్తున్నారన్నారు. ఇటువంటి పాలను అవసరమా అన్న విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఉద్యోగుల చేస్తున్న ఉద్యమానికి అండగా ఉంటామన్నారు. 

కర్నూలు జిల్లా ఆత్మకూరులోని పద్మావతి పాఠశాల వెనకాల మసీదు నిర్మాణం విషయంలో వివాదం చెలరేగింది. మసీదును అక్రమంగా నిర్మిస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. వివాదం తలెత్తింది.
 
ఈ క్రమంలో శ్రీకాంత్‌ రెడ్డి వాహనంపై మరో వర్గం వారు దాడి చేసి.. ధ్వంసం చేశారు. దీంతో శ్రీ‌కాంత్ రెడ్డిని  వారి నుంచి తప్పించుకునే క్రమంలో వాహనం వేగంగా నడపడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు.  దీంతో అక్కడి నుంచి శ్రీకాంత్‌రెడ్డి నేరుగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

click me!