ఏం చేశారో మోదీ చెప్తారు: చంద్రబాబుకు కన్నా కౌంటర్

Published : Feb 09, 2019, 03:18 PM IST
ఏం చేశారో మోదీ చెప్తారు: చంద్రబాబుకు కన్నా కౌంటర్

సారాంశం

గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోదీ పర్యటనను అడ్డుకోడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ సభకు బస్సులు పెట్టకుండా అడ్డుకుంటున్నారని, ప్రైవేటు వాహనాలను ఎక్కికక్కడ సీజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనను నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. నాలుగున్నరేళ్లలో ఏపీకి మోదీ ఏంచేశారో చెప్పేందుకే గుంటూరు వస్తున్నారని ఆయన చేసిందేమిటో అప్పుడు తేలుతుందన్నారు. 

గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోదీ పర్యటనను అడ్డుకోడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ సభకు బస్సులు పెట్టకుండా అడ్డుకుంటున్నారని, ప్రైవేటు వాహనాలను ఎక్కికక్కడ సీజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఎన్ని కుట్రలు చేసినా మోదీ సభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా మోదీ చెప్పబోయే వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  ఏం చెప్తున్నారో వినకుండా ముందే నిరసనలకు పిలుపు ఇవ్వడం దారుణమన్నారు కన్నా లక్ష్మీనారాయణ.
 
PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu