నిమ్మగడ్డకు నరకం చూపిస్తున్నారు.. గవర్నర్ కి కన్నా లేఖ

By telugu news teamFirst Published Jun 18, 2020, 7:59 AM IST
Highlights

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి వైసీపీ ప్రభుత్వం నరకం చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే రాష్ట్ర అధిపతిగా ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలంటూ కన్నా.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ని కోరారు. 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వహించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి వైసీపీ ప్రభుత్వం నరకం చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే రాష్ట్ర అధిపతిగా ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలంటూ కన్నా.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ని కోరారు. ఈ మేరకు ఆయన గవర్నర్ కి లేఖ కూడా రాశారు.

‘‘అన్ని ప్రజాస్వామిక నిబంధనలను ఉల్లంఘిస్తూ స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు తెగబడిన అధికార పార్టీ తీరుపై ఎప్పటికప్పుడు బీజేపీ మీ దృష్టికి తెచ్చింది.రాష్ట్రంలో ఇద్దరు జిల్లా కలెక్టర్లు, ఇద్దరు జిల్లా ఎస్పీల బదిలీ, సస్పెన్షన్‌కు ఎన్నికల సంఘం సిఫారసు చేస్తే ప్రభుత్వం అమలు చేయలేదు. హైకోర్టు తీర్పులను సైతం ఉల్లంఘిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన ప్రభుత్వం రమేశ్‌ కుమార్‌కు నరకం చూపిస్తోంది’’ అని తన లేఖలో వివరించారు. 

హైకోర్టు తీర్పు మేరకు తన కార్యాలయానికి వచ్చిన రమేష్ కుమార్‌ను అడ్డుకోవడానికి పోలీసు బలగాలను మోహరించడం దారుణమన్నారు. వీటన్నింటినీ రాజ్యాంగ అధిపతిగా సరిచేయాలనీ, రమేష్ కుమార్‌ను ఎస్‌ఈసీగా తిరిగి పునరుద్ధరించాలని గవర్నర్‌కు బీజేపీ అధ్యక్షుడు విన్నవించారు.

click me!