కాణిపాకం ఆలయంలో దారుణం.. పాత రథ చక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు..

Published : Jan 27, 2022, 10:48 AM IST
కాణిపాకం ఆలయంలో దారుణం.. పాత రథ చక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలో (Kanipakam Temple) దారుణం చోటు చేసుకుంది. పాత రథ చక్రాలకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. 

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలో (Kanipakam Temple) దారుణం చోటు చేసుకుంది. పాత రథ చక్రాలకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఆలయంలో గోశాల పక్కన ఉంచిన పాత రథ చక్రానికి దుండగులు నిప్పుపెట్టగా.. మంటలు గమనించిన ఆలయ సిబ్బంది ఆర్పివేశారు. ఈ ఘటనలో రథచక్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఆ రథం శిథిలావస్థకు చేరుకోవడంతో.. కొంతకాలంగా గోశాల పక్కన ఉంచినట్టుగా తెలుస్తోంది. అయితే భద్రతా వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని భక్తులు భావిస్తున్నారు. ఇక, ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనా..? లేక ఇంకెవరైనా కావాలని చేశారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్