పీఆర్సీ:ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్

By narsimha lode  |  First Published Jan 27, 2022, 9:50 AM IST

ఉద్యోగ సంఘాలను చర్చలకు రావాలని ఏపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అయితే ఈ చర్చలకు ఉద్యోగ సంఘాలు హాజరౌతాయా లేదా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వంతో చర్చలకు హాజరు కావాలంటే తమ రెండు డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి.


అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం గురువారం నాడు చర్చలు జరపాలని భావిస్తోంది. ఈ మేరకు చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పంపింది. పీఆర్సీ స్టీరింగ్ కమిటీలో ప్రధాన భూమిక పోషిస్తున్న 20 ఉద్యోగ సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ Shashi Bhushanచర్చలకు ఆహ్వానించారు. 

  Andhra Pradesh ప్రభుత్వంతో చర్చలకు రావాలంటే Employees ప్రధానంగా రెండు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. Ashutosh mishra కమిటీ నివేదికను బయట పెట్టడంతో పాటు జనవరి నెలకు ఉద్యోగులకు పాత వేతనాలనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Latest Videos

PRC  విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను  వెంటనే వెనక్కి తీసుకోవాలని   ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ ఏడాది ఫిబ్రవరి 7 వ తేదీ నుండి సమ్మె చేస్తామని ఈ నెల 24న సమ్మె నోటీసు కూడా ప్రభుత్వానికి ఇచ్చాయి. అయితే ఉద్యోగులతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముగ్గురు మంత్రులతో పాటు  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కూడా ఉన్నారు.  

Strike నోటీసు ఇవ్వడానికి ముందు నుండే ఉద్యోగ సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. పీఆర్సీ సాధన సమితి పేరుతో ఉద్యోగ సంఘాలు ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి.  ఇప్పటికే రెండు దఫాలు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది.  సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత రెండు డిమాండ్లను పరిష్కరిస్తేనే తాము చర్చలకు హాజరౌతామని  పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.  

click me!