తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ.. వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Jan 27, 2022, 10:14 AM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయాలని నిర్ణయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..


తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయాలని నిర్ణయింది. ఈ నెల 28 న ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచనుంది. ఆ మరుసటి రోజు అంటే జవనరి 29న ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. కరోనా నేథ్యంలో టీటీడీ.. శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను విడుదల చేస్తుంది.

ఇక, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటుగా, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanams) శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను విడుదల చేయడంతో.. అవి ఆన్‌లైన్‌లో ఉంచిన కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా బుక్ అయిపోతున్నాయి. దీంతో శ్రీవారి భక్తులు చాలా మందికి తీవ్ర నిరాశ మిగులుతుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి నెల నుంచి అయినా శ్రీవారి దర్శన టికెట్లను పెంచుతారనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం కరోనా మరోసారి వేగంగా వ్యాప్తి చెందడం, కేసులు అధికంగా నమోదు కావడంతో.. ఈ నెల కూడా పరిమిత సంఖ్యలోనే టికెట్లను విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. టికెట్లను బుక్ చేసుకోవడానికి భక్తులు.. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

కోవిడ్ నిబంధనలు తప్పనిసరి..
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే. దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా 48 గంటల ముందు చేసుకున్న కోవిడ్ టెస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలి. కోవిడ్ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌  లేదా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగిటివ్‌ సర్టిఫికెట్‌ను ఉన్నవారిని మాత్రమే అలిపిరి చెక్ పాయింట్ నుంచి తిరుమలకు అనుమతిస్తున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భక్తులు ఇందుకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. 

click me!