చంద్రబాబు పెంచితేనే కేసీఆర్ నాయకుడు అయ్యారు

By Nagaraju TFirst Published Dec 29, 2018, 8:57 PM IST
Highlights

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ కు తాగుడు, వాగుడు తప్ప ఇంకేమైనా అర్హతలు ఉన్నాయా అంటూ నిలదీశారు.  ప్రధాని నరేంద్రమోదీ వేసే బిస్కట్లకు ఆశపడి చంద్రబాబు నాయుడపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.  
 

అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ కు తాగుడు, వాగుడు తప్ప ఇంకేమైనా అర్హతలు ఉన్నాయా అంటూ నిలదీశారు.  ప్రధాని నరేంద్రమోదీ వేసే బిస్కట్లకు ఆశపడి చంద్రబాబు నాయుడపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.  

చంద్రబాబునాయుడపై కేసీఆర్ వాడిన భాష దురదృష్టకరమన్నారు. కేసీఆర్ అవాకులు, చెవాకులు దారుణంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు పెంచితేనే కేసీఆర్ నాయకుడు అయ్యాడని ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఒకప్పుడు టిక్కెట్ల కోసం చంద్రబాబు చుట్టూ కేసీఆర్ కాళ్లరిగేలా తిరిగారని అది గుర్తుంచుకోవాలని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. 

జగన్ వల్ల కావడం లేదని మోదీ కేసీఆర్ ను ఏపీలోకి వదిలారని మోదీ వేసే బిస్కట్లకు కక్కుర్తిపడి ఇష్టం వచ్చినట్లు వాగితే భయంకరమైన స్థాయిలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ ఏకమై ఏపీలో తిరిగినా చంద్రబాబును ఓడించడం వాళ్ల తరం కాదన్నారు. 

మోదీ దించిన రెండో కృష్ణుడు కేసీఆర్ అంటూ కాల్వ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి కేసీఆర్ ఏదో చేస్తారన్న భ్రమలో మోదీ ఉన్నారంటూ విమర్శించారు. 

మరోవైపు హైకోర్టు విభజనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా మంత్రి కాల్వ శ్రీనివాసులు ఖండించారు. తాము హైకోర్టు విభజనను కోరుకుంటున్నామని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే కోర్టు ఉండాలని, ఏపీ లాయర్లే వాదించాలన్న ఆలోచన తమకు ఉందన్నారు. 

అయితే గడువు ఇవ్వకుండా ఆకస్మాత్తుగా వెళ్లిపోమ్మంటే ఎక్కడికి వెళ్లిపోతారన్నారు. కనీసం మౌళిక సదుపాయాలు కల్పించకుండా విధులు నిర్వహించాలంటే ఉద్యోగులకు ఇబ్బందులు ఉంటాయని తెలిపారు.
 
ఉమ్మడి కేసుల విషయంలో కొంత స్పష్టత వచ్చే వరకు విభజించొద్దని మాత్రమే తాము అంటున్నట్లు తెలిపారు. ఒకప్పుడు రాజకీయంలో ఉన్న ఆర్థిక నేరగాళ్లకు శిక్షలు వేయిస్తామని చెప్పిన మోదీ మాట తప్పారన్నారు. 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులను జాప్యం చేసేందుకే కోర్టును విభజనను వేగవంతం చేశారన్నారు. నిన్న మెున్నటి వరకు మోదీని విమర్శించిన కేసీఆర్ మోదీని కలిసిన వెంనటే హైకోర్టు విభజన ప్రకటన రావడం అందులో భాగమేనన్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా భారీ మెజారిటీతో గెలుస్తాం, ఆయన తిట్లే మాకు ఆశీర్వచనాలు

సీఎం అయినంత మాత్రాన కేసీఆర్ అలా చెండాలంగా మాట్లాడతారా

 

click me!