కాకినాడ మేయర్ సుంకర పావని తొలగింపు.. యాక్టింగ్ మేయర్ గా అతనే..

By AN TeluguFirst Published Oct 14, 2021, 9:08 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లోని సెక్షన్ 91/ఎ(6) ద్వారా మెజార్టీ కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులిచ్చారు. Sunkara Pavaniతో పాటు డిప్యూటీ మేయర్ కాలా సత్తిబాబును కూడా పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కాకినాడ : నాలుగేళ్ల ‘మేయర్’ గిరికి బ్రేక్ పడింది. నియంతృత్వ విధానాలతో అసంతృప్తి మూట గట్టుకుని కార్పొరేటర్ల ‘విశ్వాసం’ కోల్పోయిన మేయర్ సుంకర పావని పదవిని కోల్పోయారు. ఈ మేరకు ఆమెను mayor పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీవో ఎంఎస్ నెంబర్ 129 ద్వారా పురపరిపాలనాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లోని సెక్షన్ 91/ఎ(6) ద్వారా మెజార్టీ కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులిచ్చారు. Sunkara Pavaniతో పాటు డిప్యూటీ మేయర్ కాలా సత్తిబాబును కూడా పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

యాక్టింగ్ మేయర్ గా చోడిపల్లి
డిప్యూటీ మేయర్ చోడిపల్లి ప్రసాద్ ‘Acting Mayor’ కానున్నారు. కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం మేయర్ పదవిని కోల్పోతే ఆ స్థానంలో డిప్యూటీ మేయర్ కు అన్ని అధికారాలు దాఖలు పడతాయి. మేయర్ తో పాటు Deputy Mayor‌-1 కూడా పదవిని కోల్పోయిన నేపథ్యంలో ఇటీవలే డిప్యూటీ మేయర్ -2గా ఎన్నికైన Chodipalli Prasad తదుపరి మేయర్ ఎన్నిక జరిగే వరకు ‘యాక్టింగ్ మేయర్’గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిపేందుకు వీలుగా ప్రభుత్వం ద్వారా ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదన పంపనున్నారు. అక్కడి నుంచి తేదీ ఖరారైన వెంటనే కొత్త మేయర్ ను ఎన్నుకోనున్నారు. 

కాకినాడ మేయర్‌పై అవిశ్వాసం: నేడు ప్రత్యేక సమావేశం, అందరి చూపు వారిపైనే

ఇదిలా ఉండగా, అక్టోబర్ 5న కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసంపై  కాకినాడ కార్పోరేషన్ ప్రత్యేక సమావేశం జరగింది. అయితే  టీడీపీ కార్పోరేటర్లకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. కాకినాడ మేయర్ పై అవిశ్వాస తీర్మానం వ్యవహరాన్ని టీడీపీ, వైసీపీలు తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి.

2017లో కాకినాడ కార్పోరేషన్ కు ఎన్నికలు జరిగాయి. 48 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. కార్పోరేటర్లలో ఒకరు రాజీనామా చేశారు. ముగ్గురు మరణించారు. దీంతో ప్రస్తుతం  44 మంది కార్పోరేటర్లున్నారు. కాకినాడ కార్పోరేషన్ లో టీడీపీకి 30 మంది కార్పోరేటర్లున్నారు.

వైసీపీకి 8 మంది సభ్యులున్నారు. బీజేపీకి ముగ్గురు కార్పోరేటర్లున్నారు. ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులున్నారు. అయితే ఇండిపెండెంట్ సభ్యుల్లో ఒకరు గతంలోనే టీడీపీకి మద్దతిచ్చారు. టీడీపీకి ఉన్న 30 మంది కార్పోరేటర్లలో 21 మంది అసమ్మతి గళం విన్పిస్తున్నారు. ఇతర పార్టీలతో కలిసి ప్రస్తుత మేయర్ ను గద్దె దించాలని అసమ్మతి వర్గీయులు భావించారు. 

అయితే టీడీపీ నాయకత్వం పార్టీ నాయకత్వం విప్ జారీ చేసింది. మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ కు అనుకూలంగా ఓటు వేయాలని టీడీపీ విప్ జారీ చేసింది. విప్ జారీ చేసిన పత్రాలను టీడీపీ నేతలు జాయింట్ కలెక్టర్ కు అంతకు ముందే అందించారు. కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ పై అసమ్మతికి సంబంధించి ప్రత్యేకంగా అక్టోబర్ 5న కార్పోరేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

click me!