ఆంధ్రప్రదేశ్ లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే?

By AN Telugu  |  First Published Oct 14, 2021, 7:28 AM IST

కొవిడ్ నిబంధనల మేరకు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు రాష్ట్రంలో night curfew కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తున్నామని, అక్టోబరు 31 తేదీ వరకూ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.


అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు తాజా ఉత్తర్వులు విడుదల చేశారు.

కొవిడ్ నిబంధనల మేరకు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు రాష్ట్రంలో night curfew కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తున్నామని, అక్టోబరు 31 తేదీ వరకూ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Latest Videos

ఇక.. సభలు, సమావేశాలు, వివాహాల వంటి శుభకార్యాలకు గరిష్టంగా 250 మంది వరకూ అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. covid-19 నిబంధనలు పాటిస్తూ ఈ తరహా వేడుకలకు, కార్యక్రమాలకు హాజరు కావాలని సూచించింది.

కాగా, ఆగస్టులో andhrapradesh రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూను మరోసారి పొడగించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ys jaganనిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 4వ తేదీ వరకు కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగాయి. ఆ సమయంలో ప్రతి రోజు రాత్రి 11 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

కర్ఫ్యూ విధింపు వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, corona virus కట్టడి అవుతోందని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నైట్ కర్ఫ్యూను పొడగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. 

ఆ తరువాత, సెప్టెంబర్ లో మరోసారి రాత్రి పూట కర్ఫ్యూను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సమయంలో రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా వున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూని కొనసాగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగిస్తున్నట్లు  తెలిపింది. 

టాలీవుడ్‌కు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. థియేటర్లలో 100 శాతం ఆక్యూపెన్సీకి అనుమతి

అలాగే వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు చేపట్టానడంతో ప్రతిపక్షలు వివాదాస్పదం చేసిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల్ని కట్టడి చేయడం కోసం బహిరంగ ప్రదేశాల్లో గణపతి విగ్రహాలను పెట్టొద్దని వైద్యాధికారులు సిఫారసు చేశారు. అలాగే నిమజ్జన ఊరేగింపులు కూడా వద్దని వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఇది సర్వత్రా విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే.

దీంతోపాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీలను గుర్తించి 90 రోజుల్లోగా భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ తర్వాత వైద్యులు, సిబ్బంది లేరనే మాటలు వినిపించకూడదని సీఎం అన్నారు. బయోమెట్రిక్‌తో పక్కాగా హాజరు, పనితీరు పర్యవేక్షణ వుండాలని జగన్ ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని సీఎం అన్నారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ద్వారా సమర్థవంతమైన సేవలు అందాలని జగన్ ఆదేశించారు. డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలున్న మందులు మాత్రమే ఆసుపత్రుల్లో వుండాలని సీఎం సూచించారు. 

click me!