కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో విద్యార్ధుల అస్వస్థత: ల్యాబ్ కి బ్లడ్, యూరిన్ శాంపిల్స్

By narsimha lodeFirst Published Sep 6, 2022, 2:57 PM IST
Highlights

కాకినాడలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యార్ధులు అస్వస్థతకు గురి కావడంపై వైద్య శాఖాధికారులు విచారణ చేస్తున్నారు.ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విద్యార్ధుల అస్వస్థతకు గల కారణాలను తెలుసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖాధికారి  ఆసుపత్రిలో విద్యార్ధులను పరామర్శించారు.

కాకినాడ: కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో విద్యార్ధులు అస్వస్థతకు గురైన విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రమేష్ బాబు విచారణ చేస్తున్నారు.

మంగళవారం నాడు ఉదయం స్కూలల్ హాజరైన కొద్దిసేపటి తర్వాతే 5వ, 6వ తరగతి విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రమేష్ బాబు ప్రకటించారు.  కేంద్రీయ విద్యాలయంలో విద్యార్ధులకు నీటిని సరఫరా చేస్తున్న ఆర్వో ప్లాంట్ ను వైద్య ఆరోగ్యశాఖాధికారులు శాంపిల్స్ సేకరించారు. అంతేకాదు ఇవాళ స్కూల్ లోని ఓ విద్యార్ధి పుట్టిన రోజు. పుట్టిన రోజును పురస్కరించుకొని ఇచ్చిన విద్యార్ధి సహచర విద్యార్ధులకు చాక్లెట్లు పంపిణీ చేశారు.ఈ చాక్లెట్ల శాంపిల్స్ ను కూడా తీసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్ధుల  రక్తం, మూత్రం నమూనాలను  కూడా వైద్యాధికారులు సేకరించారు. వీటన్నింటిని పరీక్షించిన తర్వాత విద్యార్ధులు అస్వస్థతకు గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ రమేష బాబు చెబుతున్నారు.

also read:కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో పలువురు విద్యార్ధులకు అస్వస్థత: ఆసుపత్రిలో చేరిక

ఇవాళ స్కూల్ లో ఫస్ట్ పీరియడ్ పూర్తైన తర్వాత  విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరగడం, ఊపిరి ఆడకపోవడం వంటి కారణాలను విద్యార్ధులు చెప్పారు. అయితే ఎలాంటి విషవాయువుల  ఆనవాళ్లు లేవని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే విద్యార్ధుల అస్వస్థతకు గల కారణాలను అన్వేషించాలని స్థానికులు కోరుతున్నారు. రెండు తరగతులకు చెందిన  విద్యార్ధులే అస్వస్థతకు గురికావడం వెనుక కారణాలను అన్వేషించాలని విద్యార్ధుల పేరేంట్స్ కోరుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడ దృష్టి సారించింది. విద్యార్ధులు అస్వస్థతకు గురైన విషయమై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  అధికారులతో మాట్లాడారు. విద్యార్ధులకు మెరుగైన వైద్య సహయం అందించాలని ఆదేశించారు.

సెకండ్ పీరియడ్ సమయంలో ఒక్కొక్కరుగా విద్యార్ధులు  అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్ధుల కుటుంబ సభ్యులకు సిబ్బంది సమాచారం ఇచ్చారు.ఈసమాచారం ఆధారంగా స్కూల్ నుండి విద్యార్ధులను  పేరేంట్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పెద్ద ఎత్తున విద్యార్ధులు అస్వస్థతకు గురికావడంతో 108 అంబులెన్స్, క్యాబ్ లలో విద్యార్ధులను ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్ధులు అస్వస్థతకు ఎందుకు గురయ్యారనే విషయమై  వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఆరా తీస్తున్నారు.


 

click me!