రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం: నెల్లూరులో జగన్

By narsimha lodeFirst Published Sep 6, 2022, 1:51 PM IST
Highlights

నెల్లూరులోని సంగం బ్యారేజీతో పాటు నెల్లూరు బ్యారేజీని ఏపీ సీఎం వైఎస్  జగన్  మంగళవారం నాడు జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని జగన్ ప్రకటించారు

నెల్లూరు: రాష్ట్రంలోని 26 ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. 

నెల్లూరు జిల్లాలో  మేకపాటి గౌతం రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు బ్యారేజీలను ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు.మూడేళ్లలోనే రెండు బ్యారేజీలను పూర్తి చేసుకున్నామన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి రెండు ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్ఆర్ సీఎం అయ్యాక నెల్లూరు జిల్లా గురించి ఆలోచించారన్నారు.వైఎస్ఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసినందుకు తాను గర్వపడుతున్నానని జగన్ చెప్పారు. 2008లోనే సంగం బ్యారేజీ పనులు మొదలైన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత బ్యారేజీ నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు.

రెండేళ్లలో రూ. 300 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి రెండు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసినట్టుగా సీఎం వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 26 ఇరిగేషన్ ప్రాజెక్టులను ఉరుకులు, పరుగులపై పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు.చంద్రబాబు ప్రభుత్వానికి ఈ బ్యారేజీలు కట్టాలన్న ఆలోచన కూడా లేదని సీఎం విమర్శించారు. బాబు హయంలో రేట్లు పెంచి కమీషన్లు దండుకున్నారని జగన్ ఆరోపించారు.మేకపాటి గౌతం రెడ్డి పేరును సంగం బ్యారేజీకి పెట్టినట్టుగా జగన్ గుర్తు చేశారు.దీంతో మేకపాటి గౌతం రెడ్డి మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.

click me!