రఘురామ గాయాలపై సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నివేదిక: సీఐడి సంచలన ప్రకటన

By telugu teamFirst Published May 28, 2021, 9:06 AM IST
Highlights

వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు గాయాలపై సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికపై ఏపీ సిఐడి ఓ ప్రకటన విడుదల చేసింది. గాయాలు అయినట్లు నివేదిక ఇవ్వలేదని చెప్పింది.

అమరావతి: వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు గాయాలపై సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికపై ఆంధ్రప్రదేశ్ సిఐడి గురువారంనాడు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన సారాంశం చర్చనీయాంశంగా మారింది. రఘురామ కృష్ణం రాజుకు పోలీసు కస్టడీలోనే గాయాలు అయ్యాయని ఆర్మీ ఆస్పత్రి నివేదికలో లేదని సీఐడి స్పష్టం చేసింది.

రఘురామ కృష్ణంరాజు పాదాలపై ఎడిమా ఉందని మాత్రమే ఆర్మీ ఆస్పత్రి చెప్పింది తప్ప ఆయనకు గాయాలు ఉన్నాయని గానీ, అవి పోలీసు కస్టడీలోనే అయ్యాయని గానీ ఎక్కడా చెప్పలేదని సిఐడి తెలిపింది. నివేదికలో కూడా అదే విషయం ఉందని స్పష్టం చేసింది. 

ఆర్మీ ఆస్పత్రి నివేదిక కన్నా ముందే మూడు సార్లు వైద్యులు పరీక్షించి నివేదికలు ఇచ్చారని, వాటిలో ఎక్కాడా ఆయనకు గాయాలనున్నట్లు లేదని చెప్పింది.  గుంటూరు సిఐడి కోర్టులో హాజరు పరిచే ముందు ప్రభుత్వాస్పత్రిలో రఘురామకు జారీ చేసిన ఫిట్నెస్ సర్టిఫికెట్ లోనూ గుంటూరు జిజిహెచ్ వైద్యుల బృందం హైకోర్టుకు సమర్పించిన నివేదికలోనూ గుంటూరు జిల్లా జైలు డ్యూటీ డాక్టర్ ఇచ్చిన నివేదికలోనూ రఘురామకు గాయాలున్నట్లు చెప్పలేదని సిఐడి వివరించింది. 

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి  కూడా ఎడిమా విషయమే ప్రస్తావించింది తప్ప గాయాలున్నాయని గానీ అవి పోలీసు కస్టడీలోనే అయ్యాయని గానీ చెప్పలేనది స్పష్టం చేసింది. అందుకు భిన్నంగా ఆర్మీ ఆస్పత్రి గాయాలున్నట్లు ధ్రువీకరించినట్లు చెప్పడం సరి కాదని స్పష్టం చేసింది.

click me!