మేం అధికారంలోకి రాగానే... విజయసాయి, అవంతిలకు ఒకటికి ఒకటిన్నర తిరిగిస్తాం: బుద్దా వార్నింగ్

By Arun Kumar PFirst Published Jun 15, 2021, 1:01 PM IST
Highlights

ప్రతిపక్షానికి చెందిన బీసీ నేతలే లక్ష్యంగా ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడుతోందని టిడిపి నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. 

విశాఖ జిల్లా సహా ఉత్తరాంధ్రలోని బలహీనవర్గాలే లక్ష్యంగా ఏ2 విజయసాయిరెడ్డి కక్షసాధింపులు, కుట్ర రాజకీయాలు, దోపిడీ సాగిస్తున్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. ప్రతిపక్షానికి చెందిన బీసీ నేతలే లక్ష్యంగా ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడుతోందన్నారు. మరీముఖ్యంగా యాదవ, కొప్పువెలమ, గౌడవర్గాలవారిని లక్ష్యం చేసుకొని వారి ఆర్థికమూలాలు దెబ్బతీసే కుట్రలు, కక్షసాధింపులు  విజయసాయి నేతృత్వంలో కొనసాగుతున్నాయన్నారు. 

 పల్లా శ్రీనివాసరావు వైసీపీలో చేరలేదన్న అక్కసుతో ఆయనపై, ఆయన కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని వెంకన్న పేర్కొన్నారు. ఎక్కడినుంచో వచ్చిన విజయసాయి విశాఖ జిల్లా ప్రజలను అమాయకులను చేసి చెలరేగిపోతున్నాడన్నారు. ఇంకో ఏడాదిలో విజయసాయి రాజ్యసభ సభ్యత్వకాలం ముగుస్తుందని, ఆ తరువాత విశాఖ ఎంపీగా ఆయన పోటీచేస్తే ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో తేలిపోతుందన్నారు. దొంగలు, దోపిడీదారులు, కబ్జాకోరులు అంతా వైసీపీలో ఉంటే టీడీపీ నేతలను, కబ్జాకోరులు అనడం విచిత్రంగా ఉందన్నారు. 

అవినీతి, అక్రమాల్లో వేదాంతిగా పేరుగాంచిన అవంతి శ్రీనివాసరావు ఏమీ  తెలియని అమాయకుడిలా నటిస్తున్నాడన్నారు. అధికారం చేతిలో ఉందికదా అని  ఎక్కడి నుంచో వచ్చిన విజయసాయి, అవంతి విశాఖ ప్రజలతో చెడుగుడు ఆడుతున్నారని... ప్రజలు తలుచుకుంటే ఏ2, అతని బృందం గతి ఏమవుతుందో వారే ఆలోచించుకోవాలన్నారు. విజయమ్మను ఓడించారన్న అక్కసుతోనే విజయసాయి విశాఖవాసులపై ద్వేషాన్ని చూపుతున్నాడన్నారు. 

విజయసాయి విశాఖలో తిష్టవేశాక సామాన్య వైసీపీ కార్యకర్త కూడా ఎకరాలకు ఎకరాలు ఆక్రమించాడన్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విజయసాయి నేతృత్వంలో జరిగిన భూకబ్జాలు, దోపిడీల భరతం పడతామని వెంకన్న తీవ్ర స్వరంతో హెచ్చరించారు. కొప్పువెలమ వర్గానికి చెందిన అయ్యన్నపాత్రుడిపై, మాజీ ఎమ్మెల్యే అయిన పీలా గోవింద్ పై కావాలనే తప్పుడుకేసులు పెట్టి  వేధిస్తున్నారన్నారు. 

read more  వైసీపీ డీఎన్ఏలోనే అరాచకం... ఉత్సవ విగ్రహంలా మహిళా హోంమంత్రి: మాజీ మంత్రి ఆలపాటి

వైసీపీకి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖలో పట్టులేకపోవడంతో, విజయసాయి టీడీపీలోని బలమైన బీసీ నేతలను వైసీపీలో చేరేలా వేధిస్తున్నాడన్నారు. చంద్రబాబునాయుడు అనే నాయకుడికి దేశంలో ఏమూలకు వెళ్లినా ఎక్కడాలేని క్రేజ్ ఉందని, ఆయన సారథ్యంలో ముందుకెళ్లడానికే తాము ఇష్ట పడతామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినవెంటనే విజయసాయి, అవంతిలకు ఒకటికి ఒకటిన్నర తిరిగిస్తామన్నారు. 

అధికారపార్టీ ఇప్పుడు కక్ష సాధింపులే ధ్యేయంగా ముందుకు సాగుతోందని,  ఆ ప్రభావంతోనే రాష్ట్రానికి పెట్టుబడిదారులు దూరమయ్యారన్నారు. కరోనాదెబ్బకు తోడు, జగన్ దెబ్బతో రాష్ట్రం కుదేలైందన్నారు. నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయి ఆకలిచావుల దిశగాసాగే ఏపీ వెళ్లే దుస్థితిని జగన్ కల్పించాడన్నారు. నిజంగా పల్లా శ్రీనివాస రావు భూ ఆక్రమణలకు పాల్పడిఉంటే అధికారుల సాయంతో చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. పల్లా వద్దఉన్న ఆధారాలను, ఇప్పుడు భూములఎవరిపేరుతో ఉన్నాయో ఆ పత్రాలను పరిశీలించాలన్నారు. 

విశాఖవాసులు అమాయకులు అనుకోవడం విజయసాయి మూర్ఖత్వమని, ఆయనకు తగిన సమయంలో తగినవిధంగా బుద్ధిచెప్పి తీరుతారన్నారు. పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇతర నేతలకు టీడీపీ పూర్తి అండగా ఉంటుందని, వారిపై ప్రభుత్వంసాధిస్తున్న కక్షసాధింపులను అడ్డుకుంటుందన్నారు. కరోనా కారణంగా నష్టపోయిన రైతులు, చిరువ్యాపారులు, పేదలు, యువత, నిరుద్యోగులను ఆదుకునేదిశగా ప్రభుత్వం ఆలోచిస్తే మంచి దన్నారు. ప్రభుత్వ ఖజానాలోని ప్రజలసొమ్ముని తిరిగి వారికే అందించి, వారిని ఆదుకునేలా సర్కారు చొరవచూపాలని వెంకన్న హితవు పలికారు. 

click me!