కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లిని మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ కు తరలిస్తున్నారు.
పులివెందుల: అస్వస్థతకు గురైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మిని మెరుగైన చికిత్స కోసం పులివెందుల నుండి హైద్రాబాద్ కు తరలిస్తున్నారు.శుక్రవారంనాడు ఉదయం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి కళ్లుతిరిగి పడిపోయింది. వెంటనే ఆమెను పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో చేరర్పించారు. దినేష్ ఆసుపత్రిలో చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం పులివెందుల నుండి హైద్రాబాద్ కు తరలిస్తున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇవాళ విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీబీఐ విచారణకు వెళ్లే సమయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తల్లి అస్వస్థతకు గురైన విషయమై సమాచారం వచ్చింది. దీంతో సీబీఐ విచారణకు వెళ్లకుండా పులివెందులకు వైఎస్ అవినాష్ రెడ్డి బయలుదేరారు.తన తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి లాయర్ల ద్వారా వైఎస్ అవినాష్ రెడ్డి సమాచారం పంపారు.
undefined
ఈ నెల 16వ తేదీన విచారణకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశాడు. దీంతో ఇవాళ విచారణకు రావాలని సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. తల్లి అనారోగ్యం కారణంగా ఇవాళ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు.
also read:తల్లికి గుండెపోటు: వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు గైర్హాజర్ పై లాయర్లు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచింది. వరుసగా రెండు దఫాలు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంపై సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.