చిత్తూరు జిల్లాలో విషాదం: విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి

Published : May 19, 2023, 01:08 PM ISTUpdated : May 19, 2023, 01:18 PM IST
 చిత్తూరు జిల్లాలో విషాదం:  విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి

సారాంశం

చిత్తూరు జిల్లాలోని  చౌడేపల్లి మండలం  పెద్దకొండమర్రిలో  విద్యుత్ షాక్ తో  ముగ్గురు మృతి చెందారు

చిత్తూరు: జిల్లాలోని  చౌడేపల్లి మండలం  పెద్దకొండమర్రిలో  విద్యుత్ షాక్ తో  శుక్రవారంనాడు  ముగురు మృతి చెందారు.   నీటి సంపు   శుభ్రం  చేస్తున్న సమయంలో  విద్యుత్ షాక్ తో  ఈ ప్రమాదం  చోటు  చేసుకుంది.  నీటి సంప్ ను  శుభ్రం చేస్తున్న సమయంలో   విద్యుత్  వైర్ నీటిలో  పడడంతో  విద్యుత్ షాక్ కు గురై   మృతి చెందినట్టుగా  స్థానికులు  చెబుతున్నారు. 

గతంలో  కూడ  రెండు తెలుగు రాష్ట్రాల్లో  విద్యుత్ షాక్ తో పలువురు మరణించారు.ఈ నెల  11న తెలంగాణలోని మహబూబాబాద్ లో  విద్యుత్ షాక్ తో   మరికొద్ది గంటల్లో  పెళ్లి  చేసుకోవాల్సిన యువకుడు  మృతి చెందాడు.  బోర్ రిపేరు చేస్తున్న సమయంలో  ఈ ప్రమాదం  జరిగింది.ఈ ఏడాది ఏప్రిల్  14న  అన్నమయ్య జిల్లాలో  గృహ ప్రవేశం సమయంలో విద్యుత్ షాక్ తో  నలుగురు మృతి చెందారు.మృతులంతా  ఒకే కుటుంబానికి  చెందినవారు.

కడప జిల్లా చెన్నూరు మండలంఖాదర్ ఖాన్ కొట్టాలలో ఈ ఏడాది ఫిబ్రవరి  23న  జరిగిన విద్యుత్ షాక్ ఘటనలో  ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. రేకుల షెడ్డుపై  ఎక్కిన  ఇద్దరు  చిన్నారులు పొరపాటున మెయిన్ విద్యుత్ వైరును పట్టుకోవడంతో  విద్యుత్ షాక్  కు గురయ్యారు.

పల్నాడు జిల్లాలో  విద్యుత్ షాక్ తో తల్లీ కొడుకు  మృతి చెందిన ఘటన  గత ఏడాది నవంబర్  22న  జరిగింది. జిల్లాలోని  కారంపూడి ఇందిరానగర్ లో  ఇంట్లోని ఇనుప తీగపై  బట్టలు ఆరవేస్తున్న తల్లి  విద్యుత్ షాక్ కు గురైంది.  ఆమెను కాపాడే క్రమంలో  కొడుకు కూడ  విద్యుత్ షాక్ కు గురయ్యాడు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్