అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం ఇవాళ అవార్డులు అందించింది. ప్రతి ఏటా వాలంటీర్లకు ప్రభుత్వం అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే.
విజయవాడ:. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 25 పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు అని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. విజయవాడలో వాలంటీర్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారంనాడు సన్మానించారు. అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం అవార్డులు ఇచ్చింది. సేవా మిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలు అందించింది ప్రభుత్వం.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. వాలంటీర్లను సైనికులతో పోల్చారు సీఎం. అర్హత ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వాలంటీర్లు లబ్దిదారులకు అందిస్తున్నారన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు చేరడంలో వాలంటీర్లదే కీలకపాత్రగా ఆయన పేర్కొన్నారు. తాను పెట్టుకున్న నమ్మకాన్ని వాలంటీర్లు వమ్ము చేయలేదన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వాలంటీర్లు వారధులుగా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.
undefined
.ప్రతి నెల 1వ తేదీన 64 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్న సైనికులు వాలంటీర్లుగా సీఎం పేర్కొన్నారు.2.56 లక్షల వాలంటీర్లు స్వచ్ఛంధంగా పేదలకు సేవ చేస్తున్నారని సీఎం గుర్తు చేశారు.90 శాతం గడపలకు పెన్షన్ అందిస్తున్న వ్యవస్థ దేశంలో ఎక్కడా కూడా లేదని సీఎం తెలిపారు.పెన్షన్ తో పాటు రేషన్ డోర్ డెలివరీ , బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులను వాలంటీర్లు అందిస్తున్నారని సీఎం వివరించారు.
లంచాలు, అవినీతి , అరాచకలు లేని తులసి మెక్కలాంటిది వాలంటీర్ వ్యవస్థ అని సీఎం కొనియాడారుప్రభుత్వంపై నిందలు వస్తే నిజాలు చెప్పే అసలైన సత్యసారధులు వాలంటీర్లను ప్రశంసించారు.చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల ప్రజలు నష్టపోయారన్నారు. మంచి చేసిన చరిత్ర లేని వారంతా అబద్దాలు చెబుతున్నారని సీఎం జగన్ పరోక్షంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.డీబీటీ ద్వారా రూ. 2.10 లక్షల కోట్లను నేరగా లబ్దిదారులకు అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
గత టీడీపీ ప్రభుత్వంలోని జన్మభూమి కమిటీల గంజాయి వనం స్థానంలో ఎదిగిన ఓ తులసి వనమే వాలంటీర్లుగా సీఎం జగన్ చెప్పారు. ప్రజలకు మంచి చేయడం కోసం అడుగులు వేస్తున్న వాలంటీర్లే తన సైన్యంగా జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో జరిగిన దోపిడీ నేడు ఎవరి సహకారం లేకుండా ప్రజలకు అందుతున్న సంక్షేమ లబ్ధికి మధ్య తేడాను వివరించాలని సూచించారు సీఎం జగన్.
ప్రజలకు మంచి చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు ఎల్లో మీడియాకు తీవ్రమైన కడుపు మంట వస్తోందని విమర్శించారు. ఆజ్మోలా ట్యాబ్లెట్ వేసినా కూడా ఈ కడుపు మంట తగ్గదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎంత సేపూ తన దోపిడీ జన్మభూమి కమిటీలపైనే చూపంతా ఉంటుందని విమర్శించారు. దీనికి తోడు ప్రజలకు మంచి చేస్తున్న వాలంటీర్లను అల్లరి మూకలు అంటూ అవమానించేందుకు బుద్ధాండాలంటూ ఫైర్ అయ్యారు.
ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్క విషయంలోనూ తోడుగా నిలుస్తున్న వాలంటీర్ వ్యవస్థే తన మహా సైన్యమని సీఎం జగన్ పేర్కొన్నారు. ఒకటో తేదీన ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చే మన లాంటి వాలంటీర్ వ్యవస్థను ఎక్కడైనా చూశామా అని సీఎం జగన్ ప్రశ్నించారు.