వివేకా కేసు : మూడోసారి నోటీసులు.. రేపు విచారణకు రాలేనన్న వైఎస్ అవినాష్ రెడ్డి, సీబీఐ నిర్ణయంపై ఉత్కంఠ

Siva Kodati |  
Published : Mar 05, 2023, 08:12 PM IST
వివేకా కేసు : మూడోసారి నోటీసులు.. రేపు విచారణకు రాలేనన్న వైఎస్ అవినాష్ రెడ్డి, సీబీఐ నిర్ణయంపై ఉత్కంఠ

సారాంశం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రేపు తాను విచారణకు హాజరుకాలేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి ఆదివారం లేఖ రాశారు. దీనిపై సీబీఐ అధికారులు స్పందించాల్సి వుంది. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ విచారణను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మూడోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను రేపు విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి ఆదివారం సీబీఐకి లేఖ రాశారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్స్ వుండటంతో సోమవారం విచారణకు హాజరుకాలేనని అవినాష్ రెడ్డి లేఖలో తెలిపారు. అయితే దీనిపై సీబీఐ అధికారులు స్పందించాల్సి వుంది. 

కాగా.. పులివెందులలోని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు సీబీఐ అధికారులు. సోమవారం(మార్చి 6) రోజున విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీచేసిన సంగతి  తెలిసిందే. ఈ నెల 12న విచారణకు హాజరుకావాల్సిందిగా భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీచేయగా.. తాజాగా ఈ నెల 6వ తేదీనే విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు ఆయనకు సూచించారు. కడపలోనే విచారణకు హాజరుకావాల్సిందిగా తెలిపారు.

ALso REad: వివేకా హత్య కేసు.. వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు..

ఇక, ఈ కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు రెండుసార్లు విచారించారు. ఈ ఏడాది జనవరి 28న మొదటిసారి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించగా.. ఫిబ్రవరి 24న మరోసారి ఆయనను అధికారులు ప్రశ్నించారు. రెండోసారి సీబీఐ విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను సీబీఐకి సహకరించానని చెప్పారు. సీబీఐ అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసినంతవరకు సమాధానం చెప్పానని తెలిపారు. జాగ్రత్తగా వార్తలు  ప్రసారం  చేయాలని  మీడియాను కోరారు. తాను విజయమ్మను కలిస్తే బెదిరించి వచ్చానని కొందరు డిబేట్లు పెట్టి ప్రచారం చేశారని మండిపడ్డారు. తాను దుబాయ్‌కి పారిపోయానని ఒక వర్గం దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. అటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు.  

కేసు విచారణ జరుగుతన్న సమయంలో మీడియా చేసే ఇలాంటి చర్యల వల్ల విచారణపై ఏ విధమైన ప్రచారం పడుతుందో ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. ఒక అబద్దాన్ని 0 నుంచి 100కు.. ఒక నిజాన్ని 100 నుంచి 0 చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. వాస్తవాలు లక్ష్యంగా కాకుండా వ్యక్తి లక్ష్యంగా విచారణ జరుగుతుందని చెప్పారు. వివేకానందరెడ్డి మరణించిన సమయంలో దొరికిన లేఖను బహిర్గతం చేయాలని సీబీఐని కోరినట్టుగా చెప్పారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతూ తనకు తెలిసిన వాస్తవాలతో సీబీఐకి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. 

Also REad: వివేకాను చంపినట్టు చంపుతామన్నారు: ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపులు

గూగుల్ టేక్అవుట్ అంటున్నారని.. అది గూగుల్ టేక్అవుటా? లేదా టీడీపీ టేక్‌అవుటా? అనేది భవిష్యత్తులో తేలుతుందని అన్నారు. సీబీఐ కౌంటర్ అఫిడవిట్‌లో చెప్పిన విషయాన్ని టీడీపీ ఏడాది క్రితమే ఎలా చెప్పిందని  ప్రశ్నించారు. గత విచారణ సందర్భంగా మరోసారి రావాల్సి ఉంటుందని అధికారులు చెప్పారని.. ఈసారి అలా ఏం చెప్పలేదని అవినాష్ రెడ్డి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Nara Lokesh Watches IND vs NZ T20 World Cup: ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే | Asianet Telugu
CM Chandrababu Niadu Powerful Speech: మహిళలకు బంపర్ ఆఫర్ సీఎం పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu