ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల స్కామ్.. తనిఖీల్లో బయటపడుతున్న మోసాలు

Siva Kodati |  
Published : Aug 12, 2021, 07:39 PM IST
ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల స్కామ్.. తనిఖీల్లో బయటపడుతున్న మోసాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలానాల కుంభకోణం కలకలం రేపుతోంది. కార్యాలయాల్లోనూ చలానాలకు సంబంధించి ఒరిజినల్, నకిలీ అన్న దానిపై నాలుగు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీలకు దిగింది. ఈ క్రమంలో అన్ని రిజస్ట్రేషన్ కార్యాయాల్లో మోసాలు బయటపడ్డాయి. 

విజయనగరం జిల్లా గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి వ్యవహారం గుట్టురట్టయ్యింది. అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్‌పై పోలీసులకు సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. మొత్తం 69 డాక్యుమెంట్లకు గాను 21 లక్షల రూపాయల మేర అవినీతి జరిగిందని ఫిర్యాదులో తెలిపారు. అటు గుంటూరు జిల్లా మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల స్కామ్ బయటపడింది.

నాలుగు నెలల లావాదేవీలపై అధికారులు తనిఖీలు చేయగా 8 మంది నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా గుర్తించారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని సబ్ రిజిస్ట్రార్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. 8 మంది నుంచి 8 లక్షల రూపాయిలు రికవరీ చేశామని ఆయన అన్నారు. రాష్ట్రంలో కడప జిల్లాలో భారీ స్థాయిలో నకిలీ చలానాలు బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్నీ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ చలానాలకు సంబంధించి ఒరిజినల్, నకిలీ అన్న దానిపై నాలుగు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీలకు దిగింది. ఈ క్రమంలో అన్ని రిజస్ట్రేషన్ కార్యాయాల్లో మోసాలు బయటపడ్డాయి. 

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?