ఆనందయ్య దేవుడిచ్చిన వరం, ఆయనను కాపాడుకోవాలి: కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 29, 2021, 1:55 PM IST
Highlights

కృష్ణపట్నం ఆనందయ్యకు మద్దతుగా నిలిచారు ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ . శనివారం వీడియోలో మాట్లాడిన  ఆయన.. ప్రైవేట్ ఆసుపత్రులు ఘోరంగా దోచుకుంటున్నాయని ఆరోపించారు.  ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం వల్లే తన తల్లి చనిపోయిందని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు

కృష్ణపట్నం ఆనందయ్యకు మద్దతుగా నిలిచారు ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ . శనివారం వీడియోలో మాట్లాడిన  ఆయన.. ప్రైవేట్ ఆసుపత్రులు ఘోరంగా దోచుకుంటున్నాయని ఆరోపించారు.  ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం వల్లే తన తల్లి చనిపోయిందని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ ఉద్ధృతి కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమయంలో ఆనందయ్యను దేవుడు వరంగా ఇచ్చారని పాల్ ప్రశంసించారు.

ప్రకృతి సహజంగా లభించిన మూలికలతో మందులను తయారు చేస్తున్న ఆనందయ్యను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆనందయ్య ఉన్న చోటికి జాతీయ మీడియా వెళ్లి విచారణ జరపాలని పాల్ విజ్ఞప్తి చేశారు. ఆ మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని సంస్థలే చెబుతున్నాయన్న పాల్..  ఆనందయ్యను విడుదల చేయాలని సీఎం జగన్, డీజీపీ, కేంద్ర హోంమంత్రి, హైకోర్టు సీజేఐ, సుప్రీం సీజేఐలను కోరాలని సూచించారు. 

Also Read:భార్య ఒత్తిడితో ఇంటికి: మళ్లీ అజ్ఞాతంలోకి ఆనందయ్య, ఆయన భార్య తరలింపు

సరైన మందు లేని కరోనాపై పోరుకు ఆనందయ్య తమతో చేతులు కలపాలని కేఏ పాల్ కోరారు. ఆనందయ్యతో కలిసి తమ సంస్థ ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇందు కోసం వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయించుకోవాలని... మందు తయారీకి కావలసిన మెటీరియల్స్ తెచ్చుకుంటే.. తయారు చేసుకుని వెళ్లొచ్చన్నారు. కావలసిన ఏర్పాట్లు చేస్తామని, ఉచితంగా శిక్షణ అందిస్తామని కేఏ పాల్ స్పష్టం చేశారు. సెక్యూరిటీ పేరుతో ఆయనను నిర్బంధించారని.. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని పాల్ డిమాండ్ చేశారు. 

click me!