అర్ధరాత్రి పోలీసులు దొంగల్లాగా వస్తున్నారు.. కేఏ పాల్..

By AN TeluguFirst Published May 1, 2021, 2:10 PM IST
Highlights

మేడే సందర్భంగా కార్మికలందరికి కె ఏ పాల్  శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులందరికీ  అండగా ఉంటానని తెలిపారు. 15 నెలల్లో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన దేశం లో చాలా మందికి కారోన వచ్చిందన్నారు.

మేడే సందర్భంగా కార్మికలందరికి కె ఏ పాల్  శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులందరికీ  అండగా ఉంటానని తెలిపారు. 15 నెలల్లో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన దేశం లో చాలా మందికి కారోన వచ్చిందన్నారు.

ఎపి ప్రభుత్వం వెంటనే 10, ఇంటర్ పరీక్షల వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. తాను చేస్తున్న దీక్షకు ఎంతో మంది తల్లి తండ్రులు సంఘీభావం తెలిపారన్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో పరీక్షలు పెట్టి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అడకండి అని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

జగన్ ని కలవడానికి విజయవాడ వెళ్ళానన్నారు. పరీక్షల విషయంలో ఏకపక్షంగా కాకుండా తల్లి తండ్రుల సలహా, కోర్టు సలహాలు తీసుకోమని సూచించారు. పరీక్షలు వాయిదా వెయ్యండి.. అప్పుడే నేను నిరాహార దీక్ష విరమిస్తాను అని చెప్పుకొచ్చారు. 

తన దీక్షా శిబిరం దగ్గరికి అర్ధరాత్రి పోలీసులు దొంగల్లాగా వస్తున్నారని, దీక్ష ఆపడానికి అరెస్ట్ చేయాలనుకుంటున్నారన్నారు. నన్ను కేజీహెచ్ లో జాయిన్ చేసి చంపాలని చూస్తున్నారు. కానీ అది జరగదు అన్నారు. 

మీరు మొండిగా ఉండకండి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకండి.. పరీక్షలు వాయిదా వేసివరకూ నా దీక్ష ఆగదు అంటూ హెచ్చరించారు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

 

click me!