ఐదురోజుల ఏసీబీ కస్టడీలో ధూళిపాళ్ల.. రాజమండ్రినుంచి విజయవాడకు తరలింపు..

Published : May 01, 2021, 01:49 PM IST
ఐదురోజుల ఏసీబీ కస్టడీలో ధూళిపాళ్ల.. రాజమండ్రినుంచి విజయవాడకు తరలింపు..

సారాంశం

సంగం డైరీ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని దూళిపాళ్ల పై ఆరోపణలు రావడంతో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ ఐదు రోజుల కస్టడీకి తీసుకుంది. శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలు విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

సంగం డైరీ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని దూళిపాళ్ల పై ఆరోపణలు రావడంతో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ ఐదు రోజుల కస్టడీకి తీసుకుంది. శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలు విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

అలాగే ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులు విజయవాడ ఎసిబి కార్యాలయానికి వచ్చారు. సంగం డైరీ లావాదేవీల్లో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారనే కేసులో ధూళిపాళ్లను ఇరికించారని నరేంద్ర భార్య జ్యోతిర్మయి కంటతడి పెట్టారు.

అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ధూళిపాళ్ల నరేంద్ర భార్య తెలిపారు. ధూళిపాళ్లను కలిసేందుకు ఏసీబీ కార్యాలయానికి న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ వచ్చారు. అయితే పోలీసులు రామకృష్ణను దూళిపాళ్ల నరేంద్ర ను కలవకుండా అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఆ తరువాత కొద్దిసేపటి తర్వాత రామకృష్ణ దూళిపాళ్ల ను కలుసుకోవడానికి పోలీసులు అనుమతించారు.

కాగా, టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. 4 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో ధూళిపాళ్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.

సంగం డెయిరీ కేసు: కస్టడికి ధూళిపాళ్ల నరేంద్ర, ఏసీబీకి న్యాయస్థానం అనుమతి...

ధూళిపాళ్ల నరేంద్ర కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ధూళిపాళ్ల తరపున న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుతం సంగం డెయిరీ ప్రభుత్వ ఆధీనంలో ఉందని, ధూళిపాళ్లను విచారించాల్సిన అవసరం ఏముందని రామకృష్ణ ప్రసాద్‌ ప్రశ్నించారు.

అయితే భూమి బదిలీ కూడా రికార్డుల్లో ఉందని.. ధూళిపాళ్ల వ్యక్తిగతంగా ఏమీ ప్రయోజనం పొందలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ధూళిపాళ్లను తమకు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు.

సంగం డెయిరీ కేసులో మరిన్ని అంశాలను విచారించాల్సి ఉందని ఏసీబీ లాయర్లు  తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నరేంద్ర బెయిల్‌ పిటిషన్లపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్