సుప్రీంకోర్ట్‌లో మరో తెలుగు జడ్జి.. ఎవరీ జస్టిస్ పీవీ సంజయ్ కుమార్

By Siva KodatiFirst Published Feb 5, 2023, 3:05 PM IST
Highlights

సుప్రీంకోర్ట్‌లో మరో తెలుగు జడ్జి నియమితులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ సర్వోన్నత న్యాయస్థానంలో తన సేవలు అందించనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రస్తుతం మణిపూర్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు

సుప్రీంకోర్ట్‌లో కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులైన సంగతి తెలిసిందే. కొలీజియం సిఫారసుతో పాటు కేంద్రం ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో వీరి నియామకం జరిగింది. ఈ ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరు తెలుగువారు వున్నారు. హైదరాబాద్‌కు చెందిన జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ సర్వోన్నత న్యాయస్థానంలో తన సేవలు అందించనున్నారు. ఈయనతో కలిపి సుప్రీంకోర్టులో తెలుగు జడ్జీల సంఖ్య రెండుకు చేరుకుంది. ఇప్పటికే జస్టిస్ పీఎస్ నరసింహ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ ప్రస్తుతం మణిపూర్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1963 ఆగస్ట్ 14న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన పూర్తిపేరు పులిగోరు వెంకట సంజయ్ కుమార్. వీరి పూర్వీకులది ఏపీలోని అనంతపూర్ జిల్లా. తర్వాత వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. 

జస్టిస్ సంజయ్ కుమార్ తండ్రి పి.రామచంద్రారెడ్డి 1969 నుంచి 82 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. జస్టిస్ సంజయ్ కుమార్ 1988లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా చదువుకున్న ఆయన.. అదే ఏడాది ఆగస్ట్‌లో ఏపీ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం తండ్రి వద్దే న్యాయవాదిగా చేరారు. 2000-03 మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2008లో ఏపీ హైకోర్ట్ అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత 2019 అక్టోబర్ 10న పంజాబ్- హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ కుమార్ ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అనంతరం 2021 ఫిబ్రవరి 14 నుంచి మణిపూర్ హైకోర్ట్ ప్రధాన మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 
 

click me!