ఎన్ కౌంటర్ అనంతరం కాస్త మౌనంగా ఉన్న సీపీ సజ్జనార్ ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. అందులో భాగంగానే కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతపురం: దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటనతో ఒక్కసారిగా మార్మోగిన పేరు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా హీరో అయిపోయారు.
సోషల్ మీడియాలో హీరో అయిపోయారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. దాంతో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ గా నిలిచారు. అనంతరం దిశ ఎన్ కౌంటర్ ఘటన సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో మరింత పాపులర్ అయిపోయారు.
ఎన్ కౌంటర్ అనంతరం కాస్త మౌనంగా ఉన్న సీపీ సజ్జనార్ ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. అందులో భాగంగానే కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సైబరాబాద్ సీపీకి ఆయల అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దైవ దర్శనం అనంతరం సజ్జనార్ ఆలయ ప్రాంగణంలో కలియ తిరుగుతూ ఆలయ శిల్ప కళా సంపదను చూస్తూ మురిసిపోయారు.
అర్చకులను అడిగి వాటి విశిష్టను తెలుసుకున్నారు సీపీ సజ్జనార్. ఆలయంలోని శిల్పాలు అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడారు. కుటుంబ సమేతంగా ఆలయంలో చాలాసేపు సందడిగా గడిపారు సీపీ సజ్జనార్.