పట్టిసీమ ప్రాజెక్టువద్ద భారీ అగ్నిప్రమాదం...పేలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు

By Arun Kumar PFirst Published Dec 14, 2019, 7:51 PM IST
Highlights

ఆంధ్ర  ప్రదేశ్ లోని  పట్టిసీమ నీటిపారుదల ప్రాజెక్టు వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ప్రాజెక్టు పర్యవేక్షణ అధికారులు, సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంప్ హౌస్ వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ నుండి  ఒక్కసారిగా  మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ట్రాన్స్ ఫార్మమ్ లకు మంటలు వ్యాప్తించి  భారీ శబ్దాలు చేస్తూ పేలిపోతున్నాయి. దీంతో ప్రాజెక్టు వద్ద వుండే అధికారులతో పాటు సమీప గ్రామాల ప్రజలు భయాందోళనతో పరుగులుపెట్టారు.

ఈ అగ్నిప్రమాదానికి షాట్ సర్క్యూట్ కారణమై వుంటుందని తెలుస్తోంది. మెల్లిగా ప్రారంభమైన మంటలు ట్రాన్స్‌ఫార్మకు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మంటల తీవ్రత పెరగడమే కాదు ట్రాన్స్‌ఫార్మర్లు భారీ శబ్దాలు చేస్తూ పేలుతున్నాయి. దీంతో ఈ పంప్ హౌజ్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు  భయాందోళకు గురవుతున్నారు. 

ఇప్పటికే అధికారులు ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మరికొద్దిసేపట్లో వారు సంఘటనా స్థలానికి చేరుకునేఅవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

read more జగన్ ప్రభుత్వ సంచలన నిర్ణయం... ఐఆర్ఎస్ అధికారి డిప్యుటేషన్ రద్దు

ఆంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధానం పేరుతో చంద్రబాబు నిధులు అనుసంధానం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ  ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీలోనే ఆరోపించారు. ఈ క్రమంలోనే పట్టిసీమ వంటి పథకాలను అడ్డుపెట్టుకుని భారీ సంఖ్యలో నిధులు దోచుకున్నారంటూ విరుచుకుపడ్డారు. దీంతో మరోసారి పట్టిసీమ ప్రాజెక్టు వార్తల్లో నిలిచింది. 

ఆంధ్రప్రదేశ్ లో నదులుపూర్తి చేసినట్లు పదేపదే చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు అసలు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో చెప్పాలని బొత్స నిలదీశారు. ఆనాటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ప్రారంభిస్తే దాన్ని ధనయజ్ఞం అన్న చంద్రబాబు ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 

read more  జాస్తి మాత్రమే కాదు వారుకూడా చంద్రబాబు మనుషులే...అందువల్లే: అంబటి

చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో ఎటుచూసినా కరువేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనలో తిండిలేక ప్రజలు చనిపోయారని, పనులు లేక వలసలు వెళ్లిపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. 
 

click me!