ఏపీలో ఆందోళన బాటలో జూనియర్ డాక్డర్లు

By narsimha lodeFirst Published Jun 1, 2021, 2:57 PM IST
Highlights

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ఇటీవలనే తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేశారు. ఈ సమ్మె సమయంలో ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించింది.  తాజాగా ఏపీలో కూడ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు సిద్దమౌతున్నారు. 

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ఇటీవలనే తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేశారు. ఈ సమ్మె సమయంలో ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించింది.  తాజాగా ఏపీలో కూడ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు సిద్దమౌతున్నారు. 

తెలంగాణలో జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్ల కోసం గత మాసంలో సమ్మె చేశారు.  జూనియర్ డాక్టర్ల సమ్మెను పురస్కరించుకొని వారి డిమాండ్లపై తెలంాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించింది.ఏపీలో జూనియర్ డాక్టర్ల కంటే తెలంగానలోనే జూనియర్ డాక్టర్లకు  అధికంగా స్టైఫండ్ అందుతోందని  తెలంగాణ డీఎంఈ  రమేష్ రెడ్డి వ్యాఖ్యానించారు.అయితే తమ డిమాండ్ల సాధన కోసం జూనియర్ డాక్టర్లు కూడ ఆందోళనకు దిగారు. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఇవాళ జూనియర్ డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కరోనా సమయంలో జూనియర్ డాక్టర్లు ఆందోళనలు నిర్వహిస్తే  రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.  రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూను ఇంకా పొడిగించింది. సోమవారంన ాడు రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గింది.  

click me!