అలిపిరి వద్ద జూడాల ఆందోళన,ఉద్రిక్తత

Published : Aug 07, 2019, 05:19 PM IST
అలిపిరి వద్ద జూడాల ఆందోళన,ఉద్రిక్తత

సారాంశం

ఎన్‌ఎంసీ బిల్లును నిరసిస్తూ తిరుపతిలో జూడాలు పెద్దఎత్తున  ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనతో తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడ్డారు. 

తిరుపతి:  తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బుధవారం నాడు జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.  దీంతో తిరుమలకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. గంటకు పైగా జనియర్ డాక్టర్లు మానవహరం నిర్వహిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఎన్ఎంసీ బిల్లును నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.   తిరుపతిలోని  అలిపిరి తనిఖీ సెంటర్ వద్ద  బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో తిరుమలకు వెళ్లే వాహనాల రాకపోకలకు  తీవ్ర అంతరాయం ఏర్పడింది.

తిరుమలకు వచ్చిన భక్తులు జూనియర్ డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. తిరుపతిలోని గరుడ సెంటర్ వద్ద జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఎన్ఎంసీ బిల్లులో సవరణలను జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. 48 గంటలలోపుగా జూనియర్ డాక్టర్లు విధుల్లో చేరాలని కలెక్టర్ హెచ్చరించారు.

భక్తులకు ఇబ్బంది కల్గించకూడదని టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి జూనియర్ డాక్టర్లను కోరారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో భక్తులకు ఇబ్బంది కల్గించకూడదని ఆయన కోరారు. జూడాలు ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు.

బైక్ పై ధర్మారెడ్డి తిరుమలకు వెళ్లారు. జూనియర్ డాక్టర్ల ఆందోళనల నేపథ్యంలో  అలిపిరి వద్దకు భారీగా అదనపు బలగాలను తరలించారు. రెండు రోజుల క్రితం కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?